SGSTV NEWS
CrimeLatest NewsNational

ప్రభుత్వ ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. చికిత్స పొందుతున్న రోగి మృతి

ఆస్పత్రిలో కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రతను సమీక్షిస్తామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కాల్పుల సంఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Also read :దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌పై ఆమె భర్త ఫిర్యాదు

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకల రేపింది. అది కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగి మృత్యువాతపడ్డాడు. ఆదివారం ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో 32 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. నగరంలోని గురు తేగ్ బహదూర్ ఆస్పత్రిలోని మూడో అంతస్తులో చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడిన రియాజుద్దీన్‌ జూన్‌ 23న ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి మూడో అంతస్తులోని వార్డులో చికిత్స పొందుతున్నాడు.

Also read :Vizianagaram: దారుణం.. ఊయలలో ఉండగానే ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం

కాగా, ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో వార్డులోని బెడ్‌పై ఉన్న రియాజుద్దీన్‌కు ఒక డాక్టర్‌ కట్టుకడుతున్నారు. ఇంతలో 18 ఏళ్ల యువకుడు అతడి వద్దకు వచ్చాడు. వెంట తెచ్చిన గన్‌తో రియాజుద్దీన్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇది చూసి ఆ వార్డులోని రోగులు, వైద్య సిబ్బంది భయాందోళన చెందారు. మరోవైపు బుల్లెట్‌ గాయాలైన రియాజుద్దీన్‌ బెడ్‌పై కుప్పకూలాడు. రక్తం మడుగులో మరణించాడు.

Also read :కన్న తండ్రి దుష్ట చేష్ట.. సోషల్ మీడియాలో కుమార్తె నగ్న చిత్రాలు, వీడియోలు!

ఆస్పత్రిలో కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రతను సమీక్షిస్తామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కాల్పుల సంఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Also read :విద్యార్థి ఆత్మహత్యకేసులో కొత్త ట్విస్ట్.. ఆమె వేధింపులతోనే..

ఆసుపత్రుల వద్ద భద్రతను ప్రభుత్వం సమీక్షిస్తుందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టేలేదని చెప్పారు. అన్ని ఆసుపత్రుల భద్రతపై సమీక్ష నిర్వహిస్తామన్నారు మంత్రి తెలిపారు

Also read :తెలుగు రాష్ట్రాల్లో మతాల,కులాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకు వైసిపి భారీ కుట్ర…!!!

Related posts

Share this