ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 75 ఏళ్ల ఒక వృద్ధుడు తన మనవరాలి వయస్సున్న స్నేహితుడి 14 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు. ప్రసాదం ఇప్పిస్తానని తీసుకెళ్లి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఐదు నెలల తర్వాత బాలిక గర్భవతి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మనవరాలి వయస్సున్న తన స్నేహితుడి 14 ఏళ్ల కూతురిపై 75 ఏళ్ల ఒక వృద్దుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో వెలుగు చూసింది. ఐదు నెలల తర్వాత బాలిక గర్భవతి అయినప్పుడు, కుటుంబానికి ఆ విషయం తెలిసింది. బాధితురాలి తల్లి ఆమెతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల బాలిక ఐదు నెలల క్రితం పొలం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన తన తండ్రి స్నేహితుడైన బిసంబర్ దయాల్ ప్రసాదం తినిపించే నెపంతో బాలికను ఇంటికి తీసుకెళ్లాడని, ఆ తర్వాత ప్రసాదం తినిపించి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని నిందితుడు టీనేజర్‌ను బెదిరింనట్టు చెప్పుకొచ్చారు. దీంతో బయపడిపోయిన బాలికన చాలా కాలం వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
అయితే తాజాగా బాధితురాలి కడుపు కొంచెం ఉబ్బినట్టు గమనించిన బాలిక తల్లి ఏమైందని ప్రశ్నించగా.. బాలిక ఏడుస్తూ తనకు జరిగిన విషయాన్నంత తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను తీసుకొని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగిన విషయాన్ని పోలీసులు తెలిపి ఘటనపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు