November 21, 2024
SGSTV NEWS
EntertainmentNational

Biscuit Machine: బిస్కెట్‌ కోసం వెళ్లి.. తల్లి కళ్ల ముందే మెషిన్‌లో పడి నలిగిపోయిన పసివాడు



చిన్న పిల్లలకు బిస్కెట్లు, చాకెట్లు అంటే మాహా ఇష్టం. అందుకే అపరిచితులు ఇచ్చినా.. కాదనకుండే తీసుకుంటూ ఉంటారు. ఆ ఇష్టమే వాళ్లను కిడ్నాప్‌లు వంటి ప్రాణాంతక ప్రమాదాల్లో పడేస్తుంది. తాజాగా ఓ చిన్నారి బిస్కెట్‌ కారణంగా ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు. బిస్కెట్లు తయారు చేసే మెషిన్‌లో ఉన్న బిస్కెట్‌ను చేయి చాచి తీసుకునేందుకు యత్నించి, ఆ మెషిన్‌లోనేపడి మరణించాడు..


థానే, సెప్టెంబర్‌ 4: చిన్న పిల్లలకు బిస్కెట్లు, చాకెట్లు అంటే మాహా ఇష్టం. అందుకే అపరిచితులు ఇచ్చినా.. కాదనకుండే తీసుకుంటూ ఉంటారు. ఆ ఇష్టమే వాళ్లను కిడ్నాప్‌లు వంటి ప్రాణాంతక ప్రమాదాల్లో పడేస్తుంది. తాజాగా ఓ చిన్నారి బిస్కెట్‌ కారణంగా ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు. బిస్కెట్లు తయారు చేసే మెషిన్‌లో ఉన్న బిస్కెట్‌ను చేయి చాచి తీసుకునేందుకు యత్నించి, ఆ మెషిన్‌లోనేపడి మరణించాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో అంబర్‌నాథ్‌లోని ఆనంద్‌నగర్‌ ఎంఐడీసీలోని రాధేకృష్ణ బిస్కెట్‌ కంపెనీలో మంగళవారం (సెప్టెంబర్‌ 3) చోటుచేసుకుంది.శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ కథనం ప్రకారం..

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఆనంద్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పూజా కుమారి (22)కి మూడేళ్ల కుమారుడు ఆయుష్‌ చౌహాన్‌ ఉన్నాడు. పూజా కుమారి తన ఇంటికి సమీపంలోని రాధేకృష్ణ బిస్కెట్‌ కంపెనీలోని కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె మంగళవారం ఉదయం కార్మికులకు లంచ్‌ బాక్సులు ఇవ్వడానికి తన మూడేళ్ల కుమారుడు ఆయుష్‌ చౌహాన్‌ను వెంటబెట్టుకొని బిస్కెట్‌ ఫ్యాక్టరీకి వెళ్లింది. అక్కడి కార్మికులకు పూజ లంచ్‌ బాక్సులు ఇస్తుండగా.. చిన్నారికి కదులుతున్న మెషిన్‌లో బిస్కెట్లు కనిపించాయి. అంతే ఒక్క ఉదుటున పరుగెత్తుకుంటూ వెళ్లి మెషిన్‌పై వంగి చేతితో బిస్కెట్‌ అందుకోబోయాడు. అయితే చిన్నారికి మెషిన్‌లో బిస్కెట్ల వెనుక ఉన్న ప్రమాదం తెలియదు. దీంతో మెషిన్‌కు ఉన్న పదునైన బ్లేడ్‌లు చిన్నారి మెడకు చిక్కుకోవడంతో లోపలికి లాగేసుకుంది. మెషిన్‌లో పడిపోయిన చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించిన ఫ్యాక్టరీలోని కార్మికులు వెంటనే యంత్రాన్ని ఆఫ్ చేసి, ఆయుష్‌ను ఉల్హాస్‌నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. చిన్నారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం. అప్పటి వరకు కేరింతలు కొడుతూ అల్లరి చేసిన తన కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లి మనసు విలవిలలాడింది. ప్రాణంలేని బిడ్డను పట్టుకుని గుండెలవిసేలా రోధించింది. చిన్నారి తల్లి పూజా కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడీఆర్ నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ భగత్ ధృవీకరించారు.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via