November 22, 2024
SGSTV NEWS
CrimeNational

Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ..అక్కడ ఏం జరుగుతోంది..?

తీహార్ జైలు అథారిటీ రక్షిత సర్వే విభాగం AIIMS, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌తో కలిసి మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను కూడా నిర్వహించింది. దీంతో పాటు ఖైదీలకు క్షయ పరీక్షలు కూడా చేశారు. అయితే ఎవరికీ పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఢిల్లీలోని సఫ్దర్​ జంగ్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నామని డీజీ సతీష్​ గోల్చా తెలిపారు.

Also read :ఆంధ్ర ప్రదేశ్ : అంతా పొలానికెళ్లారు.. ఆ ఇంట్లో నుంచి ఏదో శబ్ధం వస్తుందని చూడగా..

ఢిల్లీలోని తీహార్ జైలులో వందలాది మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకింది. 200 మంది ఖైదీలు సిఫిలిస్ లక్షణాలతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. తాజాగా ఈ వార్త తెరపైకి రావడంతో ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తీహార్​ జైలులో 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​ గా గుర్తించారు. తీహార్ జైలులో తీహార్, రోహిణి, మండోలి అనే మూడు జైళ్లు ఉన్నాయి. ఈ జైళ్లలోనే 125 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకినట్టుగా గుర్తించారు. దీంతో జైలు నిర్వహణలో గందరగోళం నెలకొంది. తీహార్‌ జైల్లో దాదాపు 14,000 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో సుమారు 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా తీహార్​ జైలు డీజీ సతీష్ గోల్చా పలు వెల్లడించారు

Also read :అదే ఆఖరి సెల్ఫీ అయింది.. ముగ్గురూ సరదగా ప్రాజెక్టు వద్దకు వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఈ మేరకు తీహార్​ జైలు డీజీ సతీష్ గోల్చా మాట్లాడుతూ.. తాను నియమితమైన తరువాత మే, జూన్​ లలో 10,500మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​ గా తేలిందన్నారు. అయితే వీరు జైలుకు వచ్చినప్పటికే హెచ్​ ఐవీ సోకిందని వెల్లడించారు. అయితే జైలులో ఉండగా ఎవరికీ హెచ్‌ఐవీ సోకలేదని జైలు అధికారులు పేర్కొంటున్నారు. నేరస్థులు జైలుకు వచ్చినప్పుడే వారికి వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలో వారికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా ఎవరికీ హెచ్‌ఐవీ సోకినట్లు కాదన్నారు.

Also read :ఫుల్లుగా తాగి మంత్రి కారునే అడ్డుకున్నారు.. కట్ చేస్తే.. సీన్ సీతార్ అయ్యిందిగా..
అయితే, జైలులో హెచ్‌ఐవీ బాధితుల కోసం ఏమైనా అదనపు చర్యలు తీసుకున్నారా అనే దానిపై జైలు స్పష్టత ఇవ్వలేదు. హెచ్‌ఐవీతో పాటు 200 మంది ఖైదీలు సిఫిలిస్ వంటి తీవ్రమైన చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. తీహార్ జైలు అథారిటీ రక్షిత సర్వే విభాగం AIIMS, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌తో కలిసి మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను కూడా నిర్వహించింది. దీంతో పాటు ఖైదీలకు క్షయ పరీక్షలు కూడా చేశారు. అయితే ఎవరికీ పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఢిల్లీలోని సఫ్దర్​ జంగ్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నామని డీజీ సతీష్​ గోల్చా తెలిపారు

Also read :Bizarre: బాబోయ్ కోళ్ల దొంగలు.. రెండ్రోజుల్లో ఏకంగా 30 కోళ్లు మాయం.. రెక్కి నిర్వహించి మరీ..!

Related posts

Share via