మీడియా పెద్ద ఎత్తున విస్తరిస్తున్న నేపథ్యంలో శనివారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం కేంద్రంగా సీనియర్ జర్నలిస్ట్ వీసం సురేష్ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న “వి ఎస్ బి మీడియా” ప్రాంతీయ కార్యాలయం శనివారం ప్రారంభం అయ్యింది.మైలవరం లోని వివేకానంద స్కూల్ రోడ్డులో వి ఎస్ బి మీడియా ప్రాంతీయ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వార్త ప్రభ దినపత్రిక అధినేత వీర్ల శ్రీరామ్ యాదవ్ మరియు ఏపీ ఎంపీఏ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పసుపులేటి చైతన్య ప్రారంభించారు…
ఈ సందర్భంగా శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ…. ప్రస్తుత కాలంలో పెరుగు తున్న టెక్నాలజీని అనుసరించి వార్త ఛానల్ లో కూడా కొన్ని రకాల మార్పులు వచ్చాయని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రస్తుతం యూ ట్యూబ్ వేదికను ప్రజలకు బాగా చేరువగా ఉన్న ప్రసార మాధ్యమంగా గుర్తించి బాగా ఉపయో గించుకుంటున్నాయని ఆయన అన్నారు.
మన జర్నలిస్టులు అందరూ గమనించాల్సిన విషయంగా చెబుతూ ప్రస్తుతం మీడియా కొంత కాలంగా రూపాంతరం చెందుతూ కాలనికి అనుగుణంగా వచ్చిన మార్పుల నేపధ్యంలో విలేకరులు అటుగా దృష్టి సారించాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్క విలేకరి టెక్నాలజీని అందిపుచ్చు కొని ప్రతి జర్నలిస్ట్ ఒక మీడియా సంస్థగా ఎదగాలనే ఆలోచన చేయాలని జర్నలిస్టులకు సూచించారు.ఇక మీడియాపై ఆశక్తితో డిప్లమో ఇన్ జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా లో జర్నలిస్ట్ గా ఈ సమాజం పట్ల బాధ్యతగా పనిచేసిన అనుభవం సురేష్ కి ఉందని శ్రీరామ్ అన్నారు.అతి కొద్దికాలం లోనే ఓ న్యూస్ వెబ్ ఛానల్ నిర్వహిస్తూ ….చిన్న మీడియా సంస్థగా ఎదిగిన వి ఎస్ బి మీడియా అధినేత సురేష్ బాబును శ్రీరామ్ యాదవ్ అభినం దించారు.భవిష్యత్తులో సురేష్ ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎంపీ ఏ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పసుపులేటి చైతన్య మరియు మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొడ్డు విజయ్ బాబు మరియు మైలవరంలోని పలు పత్రికలు మరియు టీవీ ఛానల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025