మెదక్ జిల్లా కొల్చారం మడలం పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి దగ్గర ఏడు పాయల జాతరకు నలుగురు యువకులు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా నదిలోకి స్నానానికి దిగారు. వారిలో ఇద్దరి యువకులు నీటిలో మునిగి మృతి చెందారు.
TG Crime: ఏడుపాయల వన దుర్గ మాత దర్శనానికి వచ్చిన ఇద్దరి యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ విషాద కర ఘటన మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు మృతి చెందారు. కొల్చారం మడలం పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి దగ్గర శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడు పాయల జాతరకు నలుగురు యువకులు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా నదిలోకి స్నానానికి దిగారు.
మంజీరా నది పడి..
నదిలో మునిగి పోయినవారిలో కృష్ణ (20), షామా (21) ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఉన్న మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయట పడ్డారు. అనంతరం ప్రమాదంపై పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మునిగిపోయిన ఇద్దరి యువకులను పోలీసుల సహాయంతో బయటకు తీశారు.
ఇద్దరు యువకులు మృతి చెందటంతో కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమ్మవారి దర్శనానికి వెళ్లి ఇలా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవటంతో వారి గ్రామాలతో పాటు కుటుంబం విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి