July 1, 2024
SGSTV NEWS
Andhra Pradesh

మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కులను ఐఖ్యంగా పరిరక్షించుకోవాలని సి.ఐ.టి.యు  వైట్ల ఉషారాణి కార్మికులకు పిలుపు

సి.ఐ.టి.యు*
ది.01.05.2024 (ఆచంట)

*మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కులను ఐఖ్యంగా పరిరక్షించుకోవాలని సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షురాలు వైట్ల ఉషారాణి కార్మికులకు పిలుపునిచ్చారు.*
మేడే సంధర్భంగా స్ధానిక ముత్యాలమ్మ చెర్వుగట్టు వద్ద గల భవన నిర్మాణ కార్మిక సంఘం భవనము నందు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పూసల ఏడుకొండలు సి.ఐ.టి.యు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా పంచాయితీ కార్యాలయం నుండి కొత్తూరు సెంటర్ మీదుగా ఆచంట కచేరీ సెంటర్ వరకూ కార్మికుల భారీ ర్యాలీ, ప్రదర్శన జరిగింది. కచేరీ సెంటర్ వద్ద కార్మికులు మానవహారం నిర్వహించారు. బహిరంగ సభకు అంగన్ వాడీ మండల నాయకురాలు ఎమ్.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా ఉషారాణి మాట్లాడుతూ
కార్మికులు,వేతన జీవుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం, ఉపాధి భద్రతకై ,సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ 138 వ మేడే ను  కార్మికలోకం దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటోందని అన్నారు.పోరాటాల ద్వారానే హక్కులను కాపాడుకోగలమని, ఉపాధి భద్రత కోసం,కార్మిక చట్టాల పరిరక్షణ కోసం రాబోయే కాలంలో కార్మికలోకమంతా మరింతగా ఐఖ్య ఉద్యమాలు నిర్వహించే ఆవశ్యకత ఉందని అన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేతా నాగాంజనేయులు, బొంతు శ్రీను, దుర్గాప్రసాద్,కలపర్తి నాగేశ్వర్రావు,గ్యాస్ యూనియన్ నాయకులు ఏడుకొండలు,బాలాజీ, హమాలీ వర్కర్స్ శ్రీనువాస్,రాధాకృష్ణ, అంగన్ వాడీ నాయకురాలు జి.శ్రీదేవి,కె.నాగలక్ష్మి,అరుణ,సరిత,తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via