నిడదవోలు ఇందిరా నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్ట్ పేరిట అదానీకి ప్రభుత్వ భూముల ను కట్టబెట్టడానికి, ప్రజలు విద్యుత్ అవసరాల ను అదానీకి తాకట్టు పెట్టే విధానానికి నిరసనగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమం.
ఈ సందర్భంగా అభ్యుదయ పెయింటర్స్ & ఆర్టిస్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ రవ్వ సురేష్ కుమార్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ప్రజా ప్రయోజనాల కంటే భారత కుబేరుడు అదానీ ఆస్థుల విలువను పెంచేందుకు గాను మోడి ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టు అన్నారు.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ ప్రజలు , సంస్థలు ఎవరికి వారు వ్యక్తిగతం తమ విద్యుత్ అవసరాలు తీర్చుకునే వెసులుబాటు లక్ష్యం తో రూపొందించబడిందనీ, కానీ అందుకు విరుద్ధంగా మోడి ప్రభుత్వం తన అనుంగు మిత్రుడు అదానీ కి లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూముల ను కట్టబెట్టే లక్ష్యం తోనే కాక, బి.యస్.యన్.యల్ ను నిర్వీర్యం చేసి జియో నెట్ వర్క్ వ్యాపారం ద్వారా అంబానీ ఆస్థుల విలువను పెంచిన చందంగా ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి అదానీకి సోలార్ ప్రాజెక్ట్ కట్టబెట్టడం ద్వారా ప్రజల నిత్యావసర మైన విద్యుత్ ని, విద్యుత్ ఛార్జీల ను అదానీ గుప్పిట్లో కి పెట్టి ప్రజల విద్యుత్ అవసరాలకు అదానీ పై ఆధారపడే విధానాన్ని ప్రజలు అర్థం చేసుకొని నిరసించాలన్నారు. గత ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల ఎకరాల భూమి కట్టబెట్టడం దీనికీ నిదర్శనం అన్నారు. తక్షణమే సోలార్ ప్రాజెక్ట్ ఒప్పందాలు రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు యెల్లమిల్లి వరప్రసాద్ , యెలగాడ రాజ్ పాల్, పులుగు చైతన్య , కార్తీక్, బాలు, మహేష్, యాదాలప్రసన్న, రమణ, నాగేంద్ర తదితరులు నాయకత్వం వహించారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025