December 11, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఆసరా అవుతాడనుకుంటే ఆగం చేసిండు!



లింగాలఘణపురం: చేతికందిన కొడుకు ఆసరా  అవుతాడని అనుకుంటే ఆగం చేసిండంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మండల కేంద్రానికి చెందిన గండి అంజయ్య, రేణుక దంపతుల కుమారుడు కల్యాణ్ (22) గత నెలలో యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.

మండల కేంద్రానికి చెందిన తన స్నేహితుడు దేవరాయ కరుణాకర్తో కలిసి గత నెల 25న భువనగిరి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వంగపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కల్యాణ్కు తీవ్ర, కరుణాకర్కు స్వల్ప గాయాలు కాగా పోలీసులు హై దరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కల్యాణ్ కోమాలోకి వెళ్లాడు. ఐదు రోజులు చికిత్స పొందినా ఫలితం లేదు. శనివారం రాత్రి మృతి చెందాడు.

ఫ్యాషన్ షోలపై మక్కువ

కల్యాణ్ కు ఫ్యాషన్ షోలపై మక్కువ. 2023లో సడఫ్ ప్యాషన్ షో అడిషన్స్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కల్యాణ్ భువనగిరికి ఎందుకు వెళ్లాడో ఏమో తెలియదు. ప్రమాదంలో గాయపడ్డాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో కోమాలో ఉన్న కొడుకును  చూసి తల్లడిల్లారు. ఏదైనా పని చేసి తమకు అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రుల ఆశలు నిరాశలయ్యాయి. తాము ఇష్టంగా కొనిచ్చన బైక్తో ప్రమాదం జరిగి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.



Also read

Related posts

Share via