మందార పువ్వు చూడడానికి అందంగా మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ పువ్వులో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మందారంతో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం

👉 మందార పువ్వులోని పోషకాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
👉 బరువు తగ్గాలనుకునేవారికి మందార పువ్వు ఒక మంచి ఔషధం. దీని ఆకులతో తయారు చేసిన టీ తాగడం ద్వారా కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
👉 మందార పువ్వు చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ పువ్వులతో తయారు చేసిన పేస్ట్ ని ఫేస్ మాస్క్ గా ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది. అలాగే నిగారింపును అందిస్తుంది.
👉 మందార పువ్వు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ ని పెంచడంలో సహాయపడుతుంది.
👉 ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి ఒత్తిడి, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదాలను తగ్గిస్తాయి.
👉 మందార పువ్వు జుట్టు పెరుగుదలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పువ్వుతో తయారు చేసిన నూనెను అప్లై చేయడం ద్వారా కుదుళ్ళను బలోపేతం చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

👉 మందార పువ్వు కాషాయం మలబద్దకం, ఇతర జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

👉 ఎలా తీసుకోవాలి
మందార పువ్వు ఆకులతో చేసిన టీ లేదా సలాడ్ రూపంలో దీనిని తీసుకోవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.