హోసూరు: కర్ణాటకలోని హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్ కంపెనీ మహిళా సిబ్బంది ఉండే హాస్టల్ లోని బాత్రూంలో రహస్య కెమెరా ఎపిసోడ్లో సంచలన విషయం బయటకు వచ్చింది. తన ప్రియుడు చెబితేనే బాత్రూంలో తాను సీక్రెట్ కెమెరా అమర్చినట్టు నిందితురాలు చెబుతోంది. ఇక, ఈ ఘటనలో కెమెరా అమర్చిన ఉద్యోగినిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. హోసూరు సమీపంలోని నాగమంగలం వద్ద టాటా ఎలక్ట్రానిక్ పరిశ్రమలో 20 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా కార్మికుల కోసం హాస్టల్ వసతి కల్పించింది. ఉద్దనపల్లి సమీపంలో ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 6 వేల మందికి పైగా మహిళా కార్మికులు హాస్టళ్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ హాస్టల్లోని బాత్రూంలో ఒడిశాకు చెందిన నీలాకుమారి గుప్తా (23) అనే కార్మికురాలు రహస్య కెమెరా ఏర్పాటు చేసి ఇతర మహిళల వీడియోలను రికార్డు చేసి తన ప్రియుడు సంతోష్‌కి పంపిస్తోంది.
బెంగళూరులో అరెస్టు చేసి..
అతడు వాటిని ఇంటర్నెట్లో పోస్టు చేయసాగాడు. తమ స్నానాల వీడియోలు వైరల్ అయినట్లు తెలిసి వేలాది మంది మహిళలు పరిశ్రమ యంత్రాంగం దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదు. దీంతో మంగళవారం రాత్రి నుంచి హాస్టల్ ముందు ధర్నా చేయసాగారు. పలువురు నేతలు మహిళలకు మద్దతు తెలిపారు. ఉద్దనపల్లి పోలీసులు దర్యాప్తు జరిపి నిందితురాలు నీలాకుమారి గుప్తాని అరెస్ట్ చేశారు. ప్రియుడు సంతోష్‌కుమార్ సూచనల మేరకు రహస్య కెమెరా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపింది. బెంగళూరులో దాగి ఉన్న నిందితున్ని గురువారం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇతడు కూడా ఒడిశా వాసి పనిచేసుకునేవాడు. వారిద్దరినీ తీవ్ర విచారణ జరుపుతున్నారు. తమ వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని, హాస్టళ్లలో భద్రత కల్పించాలని మహిళా సిబ్బంది డిమాండ్ చేశారు.
Also Read
- Telangana: మత్తు తలెకెక్కింది.. కాలు అదుపు తప్పింది.. కొలువు ఊడింది…
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!





