March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.


• మా అబ్బాయి ముఖం చూపించండయ్యా అని

ఏలూరు : ‘బండి చోరీ కేసు అంటూ.. మూడు రోజుల క్రితం మా  అబ్బాయిని పోలీసులు(Police) తీసుకువెళ్లారు.. నిన్న స్టేషన్కు వెళ్లాను.. ఒక్కసారైనా మా అబ్బాయి ముఖం చూపించండయ్యా అని పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. ఏమీ లేదమ్మా.. రేపు ఇంటికి వచ్చేస్తాడు అన్నారు.. వన్డే టౌన్, టూటౌన్, త్రీటౌన్, హనుమాన్ జంక్షన్ పోలీస్టేషన్లల్లో ఉన్నాడని తలో మాట చెప్పారు.. ఈరోజు చూస్తే జీజీహెచ్ లో శవమై కనిపించాడు’ అంటూ బాలుడి తల్లి వనిత బోరున విలపించింది. పదో తరగతి (Tenth grade student) (16) ໖, దెబ్బలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఏలూరులో తీవ్ర సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే..

ఏలూరులోని చేపలతూము ప్రాంతానికి చెందిన బంగారు శివ చింతలపూడిలోని విద్యాశాఖలో అ టెండర్గా పనిచేస్తున్నారు. శివ చిన్న కుమారుడు యశ్వంత్కుమార్ (16) ఏలూరులోని ప్రభుత్వ హై సూకల్లో పదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఏలూరు సీసీఎస్ పోలీసులు బండి చోరీ కేసులో రికవరీల కోసమని యశ్వంత్తో పాటు మరో ఆరుగురు పిల్లలను తీసుకువెళ్లారు. అయితే వారిని సీసీఎస్ స్టేషన్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉంచి విచారించారు.

ఈ నేపథ్యంలో తన కుమారు డి కోసం యశ్వంత్ తల్లి వనిత రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గురువారం వేకువజామున 5 గంటల సమయంలో పెదవేగి మండలం మొండూ రు ప్రాంతంలో గోదావరి కుడికాల్వ గట్టుపై య శ్వంత్ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గుర్తించి ఏలూరు జీజీహెచ్కు తరలించారు. అయితే బా లుడు అప్పటికే మృతి చెందడంతో మార్చురీలో పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు.

మార్చురీ వద్ద ఆందోళన

మార్చురీ సిబ్బంది ద్వారా యశ్వంత్ మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు శివ, వనిత, సోదరుడు కృష్ణవర్ధన్ బంధువులతో కలిసి జీజీహెచ్కు వచ్చారు. యశ్వంత్ మృతదేహాన్ని చూసి బోరున విలపించా రు. అరికాళ్ల నుంచి చాతీ వరకూ తీవ్ర గాయాలయ్యేలా నిర్దాక్షిణ్యంగా పోలీసులే కొట్టి చంపేసి, శవాన్ని ఎక్కడో పడేశారంటూ విలపించారు. తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ మార్చురీ వద్ద బైఠాయించి దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఆందోళనకు దిగారు.

కలెక్టర్కు ఫిర్యాదు

చొదిమెళ్లలో జరిగిన బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి కలెక్టర్ వెట్రిసెల్వి జీజీహెచ్కు రాగా ఆమెను కలిసి యశ్వంత్ మృతిపై ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించి న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

భిన్నంగా పెదవేగిలో ఫిర్యాదు

ఇదిలా ఉండగా పెదవేగి పోలీస్టేషన్లో భిన్నంగా ఫిర్యాదు నమోదైంది. పోలీసులు, చోటా నేతల ఒత్తి ళ్లతో యశ్వంత్ సోదరుడు కృష్ణవర్ధన్తో పెదవేగి పో లీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ఈనెల 5న తన సో దరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, 6న మొండూరు కాల్వ గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెదవేగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతిచెందాడని, మార్చురీకి తరలించి తమకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read

Related posts

Share via