• కుటుంబ కలహాలే కారణం
• ఠాణాలో లొంగిపోయిన నిందితుడు
మణికొండ: కుటుంబ కలహాలతో భార్యను చంపాడు ఓ భర్త. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షికోట్ మాధవీనగర్ కాలనీలో మంగళవారం జరిగింది. స్థానికులు, నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్ సాగర్, కృష్ణవేణి (32)కి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చన శ్రీనివాస్ సాగర్ హైదరాకోట్లోని ఓ టెంట్ హౌస్లో పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ గొడవపడేవారు
ఈ విషయంలో కృష్ణవేణి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కక్షగట్టిన శ్రీనివాస్ సాగర్.. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై సుత్తితో బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పిల్లలను తీసుకుని పోలీస్టేషన్కు వెళ్లి తన భార్యను చంపానంటూ శ్రీనివాస్ సాగర్ లొంగిపోయాడు. కాగా.. కృష్ణవేణి హత్య విషయం తెలుసుకుని హైదర్షికోట్కు చేరుకున్న ఆమె బంధువులు పోలీస్ స్టేషన్లో ఉన్న శ్రీనివాస్ సాగర్ను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు వారిని పోలీసులు సముదాయించి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు
తరలించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025