April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: పెళ్లి మండపం ఎక్కాల్సిన పెళ్లికొడుకు.. అంతలోనే ప్రమాదం

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు ఓ యువకుడు. కానీ ఇంతలోనే అనుకోని ప్రమాదం అతడిని హాస్పిటల్ బెడ్ ఎక్కేలా చేసింది. కాసేపట్లోనే పసుపు బట్టల్లో మెరిసిపోవాలని కలలు కన్న ఆ యువకుడు తీవ్ర గాయాలతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ నగరం మలక్ పేట పరిధిలో జరిగింది. ఓ ఫార్ట్యూనర్ కారు డివైడర్‌పైకి దూసుకువెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది.


మలక్‌పేట నల్గొండ x రోడ్ వద్ద ఓ ఫార్ట్యూనర్ కారు డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. ఆ సమయంలో వాహనంలో ఒక యువకుడు ఉండగా.. అతనికి కాసేపట్లోనే పెళ్లి జరగబోతునున్నట్లు తెలిసింది. కారు ముందు భాగంలో పూలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు. కారు ముందు భాగం చాలావరకు దెబ్బతింది. డివైడర్‌ని గట్టిగా ఢీకొట్టడంతో కారు లోపల భాగాలు కూడా చాలా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. మరి ప్రమాదానికి అతివేగమా?.. మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.

కాగా, పెళ్లి మండపం ఎక్కి కూర్చోవాల్సిన పెళ్లికొడుకు ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ ఎక్కి వైద్యం చేయించుకుంటున్నాడు. శుభమా అని పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఇలా గాయాలతో ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి యువకుడు గాయాలతో బయటపడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అతని ప్రాణాలు ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం.

Also read

Related posts

Share via