హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో నిర్వహించిన రేవ్ పార్టీని మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో నిర్వహించిన ఈ పార్టీ ని ఎస్వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేశారు.
Hyderabad : హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో మంగళవారం నిర్వహించిన పార్టీని మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో నిర్వహించిన ఈ పార్టీ ని ఎస్వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో పాల్గొన్న 72 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన కథనం ప్రకారం గాజుల రామారానికి చెందిన తిరుపతిరెడ్డి (వేద అగ్రి సీడ్స్), రాక్ స్టార్ ఫెర్టిలైజర్స్ సైదారెడ్డి వివిధ ప్రాంతాలకు చెందిన డీలర్స్‌తో రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫెర్టిలైజర్ యజమానుల కోసం నిర్వహించిన పార్టీలో మహిళలతో నృత్యం చేయించారు. రాక్‌స్టార్ ఫెర్టిలైజర్ యజమాని సైదారెడ్డి, వేద అగ్రి ఫెర్టిలైజర్‌కి చెందిన డీలర్ తిరుపతిరెడ్డి కలిసి ఫెర్టిలైజర్ యజమానుల సంఘం నాయకులకు ఈ పార్టీ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ పార్టీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 56 మంది డీలర్లతో పాటు 20 మంది మహిళా డ్యాన్సర్లు పాల్గొన్నారని తెలిపారు. వీరందరు నృత్యం చేస్తుండగా మహేశ్వరం పోలీసులకు సమాచారం అందింది. మఫ్టీలో వెళ్లిన పోలీసులు కాసేపు అక్కడే ఉండి గమనించి తనిఖీలు చేశారు. విదేశీ మద్యం లభ్యమైంది. పార్టీలో పాల్గొన్న వారందరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు వీరితో పాటు రిసార్టు యజమాని రాకేష్‌రెడ్డి పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 3 బ్లాక్‌డాగ్ విస్కీ మద్యం బాటిళ్లు, రెండు కాటన్ల బీర్లు స్వాధీనం చేసుకున్నారు.
Also read
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!
- చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్! విద్యార్థిని మృతి