April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

రౌడీలుగా ఎదగాలని.. తుపాకీతో కాల్చి..

రౌడీషీటర్ రియాజుద్దీన్ హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. నీటిప్లాంటు ఏర్పాటుతో మొదలైన కక్షతో ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు.

రియాజుద్దీన్ హత్య కేసులో 9 మంది అరెస్టు పరారీలో ప్రధాన నిందితుడు



హైదరాబాద్: రౌడీషీటర్ రియాజుద్దీన్ హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. నీటిప్లాంటు ఏర్పాటుతో మొదలైన కక్షతో ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. రియాజ్ను తుపాకీతో కాలిస్తే పెద్ద రౌడీలమైపోతామని అలా చేసినట్లు నిందితులు పేర్కొన్నారు. ఈకేసులో 9మందిని అరెస్టు చేశారు. దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు, గొడ్డళ్లు, కొబ్బరిబొండాల కత్తి, కారం డబ్బా, కారు, రూ.4లక్షలు, ఆరుఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఎస్వోటీ డీసీపీ మురళీధర్తో కలిసి రాచకొండ సీపీ సుధీర్ బాబు బుధవారం వివరాలు వెల్లడించారు.

నీళ్ల ట్యాంకు గొడవ: బాలాపూర్కు చెందిన ఖాజా రియాజుద్దీన్(40) రౌడీషీటర్. అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ హమీద్(56) కుటుంబం మధ్య విభేదాలున్నాయి. వివాద స్థలంలో హమీద్ నీటిప్లాంటు ఏర్పాటు చేయడంతో వీరి మధ్య గొడవలు పెరిగాయి. రియాజ్ హత్య కోసం అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్, సలీమ్(32)ని హమీద్ సంప్రదించాడు. అతడు రూ.13 లక్షలతో సుపారీ అంగీకరించాడు. స్నేహితుడి ద్వారా లఖ్నవూ నుంచి దేశవాళీ తుపాకీ, మెయినాబాద్లో కొబ్బరిబొండాల కత్తి తెప్పించాడు. సోదరుడు సుల్తాన్, బామ్మర్ది గౌస్, స్నేహితులు ఇస్మాయిల్, షేక్ హుస్సేన్ సాయంకోరాడు. హమీద్ అతడి స్నేహితుడు సయ్యద్ తెరవెనుక ఉండి కథ నడిపించారు. ఈనెల 8న రాత్రి రియాజ్.. ఆరీసీఐ రోడ్డుదగ్గరకు రాగానే సలీమ్, సుల్తాన్, గౌస్, ఇస్మాయిల్, హుస్సేన్ తదితరులు అతడి వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. అతను కింద పడగానే కళ్లలో కారంకొట్టి.. కాల్పులుజరిపారు. తలపై కత్తులతో దాడితో రియాజ్ మరణించాక వీరంతా పరారై ఓ గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఈ హత్యకుముందే హమీద్ దుబాయ్ వెళ్లిపోయాడు. పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. రాచకొండ ఐటీసెల్ ఏసీపీ నరేందర్ గౌడ్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రవికుమార్, బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి.. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసి సీసీపుటేజీలు, కాలేటా ఆధారంగా ముఠాలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మరో 8 మందిని అరెస్టుచేశారు. సూత్రధారి హమీద్, యూపీకిచెందిన ఇద్దరు పరారీలో ఉన్నారు.

స్వలింగ సంపర్కమూ కారణం!

ఈ హత్యకు స్వలింగసంపర్కం ఒక కారణమని తెలుస్తోంది. ప్రత్యర్థి గ్యాంగ్లో ఒకరిని కిడ్నాప్్చసిన రియాజ్ 10 రోజుల క్రితం స్వలింగ సంపర్కానికి పాల్పడ్డాడు. దీంతో ముఠాలో కొందరు రగిలిపోయి హత్య చేయించినట్లు తెలుస్తోంది

ఇవి కూడ చదవండి

Related posts

Share via