April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !


కొద్దిరోజుల క్రితం హైదరాబాద్  ఎంఎంటీఎస్ లో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి దూకేసిన ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచారయత్నమే జరగలేదని విచారణలో తేలింది.

MMTS Incident: కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ ఎమ్ఎమ్‌టీఎస్‌ రైలులో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగిన కేసులో(Hyderabad MMTS Rape Case) కీలక మలుపు చోటు చేసుకుంది. విచారణలో రైల్వే పోలీసులను యువతి తప్పుదోవ పట్టించింది అసలు ఆ యువతిపై అత్యాచారయత్నమే జరగలేదని విచారణలో తేల్చారు పోలీసులు.  రైలులో వెళ్తూ ఇన్ స్టా రీల్స్(Insta Reels) చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని పోలీసులు వెల్లడించారు.

తిడతారని భయపడి


ఈ విషయం చెబితే అంతా తనను తిడతారని భయపడి పోలీసులకు కట్టుకథ చెప్పిన యువతి..  తనపై ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు నమ్మించింది. విచారణలో పోలీసులకు ఎక్కడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో గందరగోళం నెలకొనడంతో యువతిని మరోమారు ప్రశ్నించగా..   తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు విని షాక్ అయ్యారు. దాదాపుగా 300కు పైగా సీసీ కెమెరాలను రైల్వే పోలీసులు పరీశిలించారు.  దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించారు.  చివరకు యువతిపై అత్యాచారం జరగలేదని తేల్చారు. న్యాయ సంబంధమైన అంశాలను పరిశీలించి కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నారు

అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్‌ మరమ్మతు కోసం గత నెల మార్చిలో సికింద్రాబాద్‌కు వెళ్లి తిగిరి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరగా  ఇన్ స్టా రీల్స్ చేస్తూ పొరపాటున కింద పడిపోయింది. దీన్ని కవర్ చేసేందుకు యువతి అత్యాచార నాటకం ఆడింది. గాయపడిన యువతిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంది

Also Read

Related posts

Share via