ప్రేమించి పెళ్లాడిన భర్తే కట్నం కావాలని వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సూర్యపేటకు చెందిన మనీషా, సంపత్ ప్రేమించుకుని గతేడాది ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్నారు. తర్వాత కట్నం కోసం వేధించడంతో ఆమె ఉరివేసుకుంది
ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిల్లు ఎక్కువయ్యాయి. ప్రేమించడం, పెద్దలకు చెప్పడానికి భయపడి పారిపోయి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇలా కొందరు గుడిలో, ఆర్య సమాజ్‌లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. అయితే మ్యారేజ్ అనంతరం కొద్ది రోజులు హ్యాపీగానే ఉంటున్నారు. కానీ మధ్యలో కట్నం వేధింపులతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని చిత్ర హింసలు పెడుతున్నారు కొందరు. తాజాగా తెలంగాణలో అలాంటి సంఘటనే జరిగింది. ఓ యువతి, యువకుడు చదువుకున్న సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.
ఏడాది వరకు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. కట్నం కోసం ఆ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే
ఏం జరిగిందంటే?
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన ఆకుల మల్లయ్య కూతురు మనీషా(24), పులిగుజ్జ సంపత్ ఇద్దరూ పారామెడికల్ కోర్సు చేసే రోజుల్లో ప్రేమించుకున్నారు. సంపత్‌ది కూడా సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం. దీంతో ఇద్దరూ ఒకే జిల్లాకి చెందిన వారు కాబట్టి పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే గతేడాది ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజున ఉప్పల్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.
మ్యారేజ్ అనంతరం రామంతాపూర్‌లో ఉంటూ సంపత్ ఓ హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా సంపత్, అతడి సమీప బంధువు భాషబోయిన మున్నిత ఆ యువతిని వేధించడం మొదలు పెట్టారు. కట్నం తేవాలంటూ చిత్ర హింసలు పెట్టారు. ఇక వీరి వేధింపులు తాళలేక ఆ యువతి మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025