June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: బీటెక్ విద్యార్థి బలవన్మరణం

ఆర్థిక ఇబ్బందులా.. మరేదైనా కారణామా..?

 

ఇబ్రహీంపట్నం: బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో చోటుచేసుకుంది. ఎస్ఐలు రామకృష్ణ, మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా అరుపాలెం మండలం, మామునూర్ గ్రామానికి చెందిన సంగెపు నరేంద్ర (27) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదిబట్ల ఏరోస్పేస్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇబ్రహీంపట్నం ఎంబీఆర్ నగర్ లోని ఎస్వీ బాయ్స్ హాస్టల్ ఉంటున్నాడు.

 

శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ రెండో అంతస్తులోని తన గదిలో బెడ్ షీట్తో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. షాపింగ్ కోసం నగరానికి వెళ్లిన రూంమేట్స్ వచ్చి చూసేసరికి విగతజీవిగా మారి కనిపించాడు. దీంతో వారు హాస్టల్ యజమాని వేణుకు సమాచారం ఇచ్చారు. వెంటనే మృతుని కుటుంబసభ్యులు, పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. మృతుని తండ్రి రాంబాబు, బంధువులు శనివారం ఉదయం హాస్టల్కు చేరుకుని బోరున విలపించారు.

 

తమకు ఎవరిపైనా అనుమానం లేదని, ఆర్థిక ఇబ్బందులు కారణం కావచ్చని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా నరేంద్ర మొబైల్ ఫోన్ లాక్ ఓపెన్ కాలేదు. కాల్ డేటాను పరిశీలిస్తే ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు ఆర్థిక ఇబ్బందులా లేక మరేమైనా ఉన్నాయా అనేది స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు

 

హాస్టల్ భవనంపై నుంచి దూకి…

 

లాలాపేట: తార్నాకలోని ఓయూ ఇంటర్నేషనల్ హాస్టల్ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం జరిగింది. ఓయూ పోలీసులు తెల్పిన మేరకు.. వికారాబాద్ జిల్లాకు చెందిన ముల్కగల్ల రవి (25) నిజాం కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తార్నాకలోని స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం రెండంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకాడు. పెద్ద శబ్దం రావడంతో గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది 108కు ఫోన్ చేశారు. అక్కడి నుంచి వెంటనే ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. తలకు, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఈమేరకు పోలీసులకు సూసైడ్ నోట్ లభించిందని తెలిసింది.

Related posts

Share via