తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని బిజెపి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా బలమైన నాయకులను ఎంపిక చేసి వారికి టికెట్లను ఇచ్చింది. దీంతో ఎన్నికలలో కాషాయ దండును ముందుకు నడుపుతూ సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు పలువురు బీజేపీ అభ్యర్థులు. ఇదే సమయంలో హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవీలత జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి వరుస వివాదాలు
సోషల్ మీడియాలో ఆమె వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ఆమె చర్యలు వరుస వివాదాలకు కారణమవుతున్నాయి. ఒకవైపు లోక్సభ ఎన్నికల గడువు దగ్గర పడుతుంటే తాజాగా హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత పై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బీజేపీ అభ్యర్థి కారణంగా సస్పెండ్ అయిన పోలీస్ అధికారిణి
శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ సిద్ది అంబర్ బజార్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతున్న సమయంలో ఆమె ఒక మసీదు పైకి విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలినట్టు పోజ్ పెట్టారు. ముస్లింల అభ్యంతరం తెలుపుతూ ఆమె పైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. తాజాగా మరొక ఘటన కూడా కొంపెల్ల మాధవి లత కారణంగానే జరిగింది. ఆమె కారణంగా ఒక పోలీస్ అధికారిణి సస్పెండ్ అయ్యింది.
కోడ్ ఉల్లంఘన నేరం.. హైదరాబాద్ సీపీ సస్పెన్షన్
ఇంతకు ఏం జరిగిందంటే పాతబస్తీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవి లతను సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ సంఘటనపై విచారణ జరిపిన సిపి ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన క్రమంలో పోలీస్ అధికారిణిపై వేటు వేసినట్టు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం