SGSTV NEWS
CrimeTelangana

Hyderabad : ఎల్‌బీనగర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురికి తీవ్రగాయాలు


హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని  బీఎన్‌రెడ్డినగర్‌ సమీపంలో ఉన్న గుర్రంగూడ దగ్గర శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Crime: హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని  బీఎన్‌రెడ్డినగర్‌ సమీపంలో ఉన్న గుర్రంగూడ దగ్గర శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తాగిన మత్తులో  థార్‌ కారు నడుపుతున్న డ్రైవర్‌ ఇంజాపూర్‌ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి కారు ముందు వెళ్తున్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టాడు. దీంతో  బైక్‌పై వెళ్తున్న సిరిసిల్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. బైక్‌పై ఉన్న విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో తనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అనంతరం థార్‌ కారు డివైడర్‌ దాటి మరో కారును ఢీ కొట్టింది.ఆ కారులోని దినేష్, శివలు కూడా గాయపడ్డారు. అనంతరం మూడు పల్టీలు కొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో థార్‌ కారులోని డ్రైవర్, యజమాని అనిరుధ్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని హస్తినాపురంలోని రెండు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also read

Related posts