హైదరాబాద్‌లో అల్వాల్ పరిధిలోని యాప్రాల్‌లో ప్రణీత్ అనే యువకుడిని స్నేహితులు హత్య చేశారు. వాటర్ ట్యాంక్ సమీపంలోని ఓ గ్రౌండ్‌లోకి ప్రణీత్‌ను తీసుకెళ్లిన స్నేహితులు దాడి చేశారు. తలను గోల్ పోస్ట్ రాడ్‌కు బాది పైశాచిక ఆనందం పొందారు.
TG Crime: ఈ మధ్య కాలంలో మనుషులు మృగాల్లా తయారవుతున్నారు. సాటి వ్యక్తి అని చూడకుండా.. చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి ఘటన తెలంగాణలో కలకలం రేపింది. హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని స్నేహితులు అతి దారుణంగా హింసించి చంపారు. అల్వాల్ పరిధిలోని యాప్రాల్‌లో ప్రణీత్ అనే యువకుడిని స్నేహితులు హత్య చేశారు. వాటర్ ట్యాంక్ సమీపంలోని ఓ గ్రౌండ్‌లోకి ప్రణీత్‌ను తీసుకెళ్లిన స్నేహితులు దాడి చేశారు. తలను గోల్ పోస్ట్ రాడ్‌కు బాది పైశాచిక ఆనందం పొందారు. అంతేకాకుండా గంటపాటు తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు.
అతి దారుణంగా కొట్టి..
దాడి చేసిన తర్వాత ప్రణీత్‌ను బైక్‌పై కూర్చొబెట్టుకని చక్కర్లు కొట్టి క్రూరంగా వ్యవహరించారు. ప్రణీత్ సోదరుడికి ఫోన్ చేసి మీ అన్నకు యాక్సిడెంట్ అయిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించాలని చూశారు. తమ్ముడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రణీత్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందిన కొడుకు హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!