హైదరాబాద్ అత్తాపూర్‌లో దారుణం జరిగింది. డెలీవరీ బాయ్ నజీమ్‌పై దుండగులు దాడి చేశారు. బ్లేడ్‌లతో కోసి, కళ్లల్లో స్ప్రే కొట్టి డబ్బులు, సెల్‌ఫోన్ దోచుకెళ్లారు. గంజాయ్ బ్యాచ్ దాడి చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
HYD Crime: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. అత్తాపూర్‌లో డెలీవరీ బాయ్ నజీమ్‌పై దుండగులు బ్లేడ్‌లతో విచక్షణారహితంగా దాడి చేశారు. నకిలీ ఆర్డర్ పెట్టి డెలీవరీ బాయ్‌ని రప్పించి కళ్లల్లో స్ప్రే కొట్టి డబ్బులు, సెల్‌ఫోన్ దోచుకెళ్లారు. నజీమ్ కేకలు వేయడంతో కేటుగాళ్లు పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నజీమ్ పై దాడి చేసింది గంజాయి బ్యాచ్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతిని వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. ఒకవేళ తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ కత్తి పట్టుకుని వారింటికి వెళ్లి మరి బెదిరింపులకు దిగాడు ఆ యువకుడు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వేధింపులను మౌనంగా భరించకండని, సోషల్ మీడియాలో కానీ, నేరుగా గానీ ఎవరైనా మిమ్మల్ని వేధింపులకు గురిచేసినా, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. లేదా 100కు డయల్ చేయండి.. మీకు సహాయం చేసేందుకు తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని కీలక సూచనలు చేశారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





