రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కొట్టడం వల్లనే బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే అతను మృతి చెందాడని పోలీసులు అంటున్నారు.
HYD BREAKING: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కొట్టడం వల్లనే బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే అతను మృతి చెందాడని పోలీసులు అంటున్నారు.
మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన ఇర్ఫాన్ (35) మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం హైదరాబాద్‌కు వలస వచ్చి.. బండ్లగూడ జాగిర్‌లోని ఖలీజ్ ఖాన్ ప్రాంతంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం తర్వాత ఇర్ఫాన్ నిషాద బేగం అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇదిలా ఉండగానే ఇర్ఫాన్ ఇంటిపక్కనే ఉండే మరో మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అది వివాహేతర బంధానికి దారి తీసింది. అయితే ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని ఇర్ఫాన్ అనుకోవడంతో భార్యభర్తల మధ్య వివాదం మొదలైంది.
ఈ వివాదంతో ఇరు కుటుంబ సభ్యులు గొడవపడి, అదేరోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇర్ఫాన్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఇరువర్గాలకు రాజీ కుదుర్చి అంగీకార పత్రం రాసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఇర్ఫాన్‌వాంతులు చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని స్థానిక ప్రైవేటు దవాఖానకు తరలించగా ఉస్మానియాకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని ఉస్మానియాకు తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కాగా ఈ విషయంలో కుటుంబ సభ్యుల వాదన వేరేగా ఉంది. ఇర్ఫాన్‌ను పోలీసులు కొట్టడంతోనే మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. పీఎస్‌లో పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక ఇర్ఫాన్ పెట్టిన కేకలు స్టేషన్ బయట రోడ్డు వరకు వినిపించాయని వారంటున్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ఇర్ఫాన్ బయటకు పరిగెత్తుకొచ్చి రెండుసార్లు వాంతులు చేసుకున్నాడని మృతుడి సోదరుడు వెల్లడించాడు. చివరికి పోలీసు స్టేషన్ ఆవరణలోనే ఇర్ఫాన్ కుప్పకూలిపోయినా పోలీసులు హాస్పిటల్‌కు కూడా తీసుకెళ్లలేదని ఇర్ఫాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే ఇర్ఫాన్‌ను పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడనడంలో వాస్తవం లేదని డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. స్టేషన్ లోని సీసీ కెమోరాలను కూడా పరిశీలించామన్నారు. పీఎస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఇర్ఫాన్ అనారోగ్యంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆటోలో ఉస్మానియాకు తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194కింద కేసు నమోదు చేశామని డీసీపీ స్పష్టం చేశారు.
Also read
- Lord Shani: ఈ ఏడాది శనీశ్వర జయంతి ఎప్పుడు? పూజా విధానం, చేయాల్సిన దానాలు ఏమిటంటే..
- Astro Tips for Neem: శని లేదా రాహు-కేతువు దోషాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంటి ఆవరణలో ఈ మొక్కని పెంచండి..
- నేటి జాతకములు…16 మే, 2025
- HYD BREAKING: పోలీస్ దెబ్బలకు వ్యక్తి మృతి?
- TG Crime: సూర్యాపేట జిల్లాలో విషాదం.. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య