బెంగళూరులో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. ఐటీ ఉద్యోగి ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు. ఆ తర్వాత భార్యతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆర్థిక సమస్యల వల్ల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన అనుప్ కుమార్ అనే ఓ ఐటీ ఉద్యోగి కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. ఇతనికి భార్య రాఖీ (35), ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చిన్నారులకు మొదటిగా విషం ఇచ్చి ఆ తర్వాత భార్యాభర్తలు ఉరి వేసుకున్నారు.
ఖర్చులు, ఆర్థిక సమస్యలతో తాళ్లలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేయగా.. వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీరే ఉరి వేసుకున్నారా? లేకపోతే ఎవరైనా చేసి ఇలా ప్లాన్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025