జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ జెడ్పీటీసీ భర్త నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొట్టి నిక్కర్‌తో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళా జెడ్పీటీసీ భర్త ఒరోరి అందగాడా.. నీకోసం.. నీ కోసం.. అనే పాటకు స్టెప్పులేసి పోలీస్ స్టేషన్ డాన్స్ క్లబ్‌గా మార్చేశాడు. అయన డాన్స్ చేస్తుంటే వీడియోలు తీసిన పోలీస్ సిబ్బంది మరింత ఎంకరేజ్ చేయడం కొసమెరుపు..! ఈ ఘటన అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
స్థానిక జెడ్పీటీసీ గుండాల అరుణ భర్త శ్రీనివాస్ మార్నింగ్ వాక్ అనంతరం అదే పొట్టి నిక్కర్ తో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. పోలీస్ సిబ్బందితో కాసేపు సరదాగా గడిపిన ఆయన సెల్ ఫోన్ లో నీ కోసం.. నీ కోసం అంటూ సినిమా పాటలకు తనను తాను మై మరచిపోయి డాన్సులు వేశాడు. ఆయన స్టెప్పులేస్తుంటే పోలీస్ సిబ్బంది చప్పట్లు చర్పించి ప్రోత్సహించడంతో మరింత రెచ్చిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్ కాస్త డాన్సింగ్ క్లబ్‌గా మారిపోయింది. ఏకంగా పోలీసులే ఈ వీడియో తీసుకుని ఏదో ఘనకార్యం చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో దీనిపై విచారణ చేపట్టారు.
అయితే పొట్టినిక్కర్‌తో పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేసిన జెడ్పీటీసీ అరుణ భర్త శ్రీనివాస్ మాత్రం అందులో తప్పేముంది. అలా పాటలతో డ్యాన్స్ చేయడం ఒకరకమైన వ్యాయామం అంటున్నారు. ఏరోబిక్స్ కూడా ఇలాగే పాటలకు డాన్స్ రూపంలో వ్యాయమం చేస్తుంటారని అందులో తప్పేమీ లేదని తనను సమర్థించుకున్నాడు. ఏదైతేనేం.. చివరికి అతగాడి వీడియో నెట్టింగ వైరల్ అవుతుండటంతో విచారణ చేపట్టారు జిల్లా పోలీసులు.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..