SGSTV NEWS
Spiritual

వాహనాలకు నిమ్మకాయ, మిరపకాయలు ఎందుకు కడతారు.. దానికి వెనుక రహస్యం ఏంటో తెలుసా?



చాలా మంది ఇంటి గుమ్మాలకు, కొత్తగా కొన్న వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలుతో కూడిన దండలను వేలాడుతుండటం మీరు చూసి ఉంటారు. ఇలా కట్టడం ద్వారా నెగిటివ్‌ ఎనర్జీస్‌ ఇంట్లో ప్రవేశించవని, వాహనాలు ప్రమాదాలు జరగవని చెబుతుంటారు. కానీ వీటి వెనక ఇతర కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? తెలియక పోతే అవేంటో ఇక్కడ తెలుసుకోండి.


అనతి కాలం నుంచి మనం పెద్దలు పాటించే ఆచారాలను మనం అలానే పాటిస్తూ వస్తున్నాం. ఇలా చాలా మంది పాటించే సాంప్రదాయాల్లో ఇంటి గుమ్మాలకు, కొత్తగా కొన్న వాహనాలకు నిమ్మకాయల దండలను కట్టడం కూడా ఒకటి.ఈ సంప్రదాయం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతుంది. అందుకే, నేటికీ దీనిని ప్రశ్నించకుండానే అందరూ పాటిస్తున్నాము. కానీ వారు వాటిని ఇలా ఎందుకు వేలాడదీస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రకమైన ఆచారానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. అవేంటనే పరిశీలిస్తే..

దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి?
ఇంటి గుమ్మాలు, వాహనాల తలుపులకు నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడం వల్ల చెడు దృష్టి, నెగిటీవ్‌ ఎనర్జీలు మన ఇంట్లోకి ప్రవేశించవని చాలా మంది నమ్ముతారు. అలాగే వీటిని వాహనాలకు కట్టినప్పుడు అవి ప్రమాదాలను నివారించడంలో, వాహనాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుందని చెబుతారు. వీటిలోని శాస్త్రీయ కారణాన్ని పరిశీలిస్తే, నిమ్మకాయలు, మిరపకాయల లక్షణాలు పర్యావరణ పరిశుభ్రతను కాపాడుకోవడానికి సహాయపడతాయి.

నిమ్మకాయ, మిరపకాయల బలమైన వాసన దోమలు, ఈగలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచుతుంది. ఇది ఇంటి లేదా వాహనం వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుతుంది. ఇది గాలిలోని సూక్ష్మక్రిములను, ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. అలాగే వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది. అందువల్ల, చాలా మంది ఇంటి గుమ్మాలు లేదా వాహనాలకు నిమ్మకాయ, మిరపకాయలను వేలాడదీస్తారు.

Related posts