చాలా మంది తమ ఇంటి ముందు లేదా ఇంటి ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో బొప్పాయి చెట్లను నాటుతారు. ఈ చెట్టు అందంగా కనిపిస్తుంది. బొప్పాయి ఆకులు, కాయలు, పండ్లు కూడా తింటారు. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టును ఇంట్లో లేదా ఇంటి ముందు నాటడం సరైందేనా అనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారు జ్యోతిశాష్య వాస్తుశాస్త్ర నిపుణులు.
ఇల్లు ఏ దిశలో ఉండాలి? గృహోపకరణాలను ఎక్కడ ఉంచాలి? వాటిని ఎలా ఉపయోగించాలి? ఇలాంటి అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. ఇంట్లో నాటాల్సిన చెట్లు, మొక్కల గురించి కూడా వాస్తు శాస్త్రంలో సమాచారాన్ని అందిస్తుంది. ఇంట్లో చాలా మొక్కలు నాటడం నిషేధం.. ప్రస్తుతానికి, మనం బొప్పాయి చెట్టు గురించిన వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.
చాలా మంది తమ ఇంటి ముందు లేదా ఇంటి ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో బొప్పాయి చెట్లను నాటుతారు. ఈ చెట్టు అందంగా కనిపిస్తుంది. బొప్పాయి ఆకులు, కాయలు, పండ్లు కూడా తింటారు. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టును ఇంట్లో లేదా ఇంటి ముందు నాటడం సరైందేనా అనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారు జ్యోతిశాష్య వాస్తుశాస్త్ర నిపుణులు.
బొప్పాయి చెట్టును ఇంటి ముందు నాటకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. పొరపాటున ఈ మొక్క అలా తప్పుగా పెరిగితే, మీరు దానిని తొలగించి మరో చోట నాటాలని చెబుతున్నారు. అలాగే బొప్పాయి చెట్టును ఇంటికి ఎదురుగా పెంచితే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తరచూ అనుమానాలు, విభేదాలు, కలహాలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలుగారే ఈ చెట్టు వల్ల చిన్నపిల్లలపై కూడా చెడు శక్తులు ప్రభావం చూపుతాయని అంటున్నారు. అందుకే ఇంటికి, పరిసరాలకు దూరంగా పెంచాలని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రంలో, బొప్పాయి చెట్టు ఆర్థిక నష్టాన్ని కలిగించేదిగి పరిగణిస్తారు. శాంతి, ఆనందానికి భంగం కలిగించే చెట్టుగా చెప్పబడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, పూర్వీకులు బొప్పాయి చెట్టులో నివసిస్తారని నమ్ముతారు. అందువల్ల బొప్పాయి చెట్టు ఇంట్లో లేదా ఇంటి ప్రాంగణంలో ఉంటే.. ఆ కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఉద్వేగాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చెట్టు వల్ల ఇంట్లో ఓ ప్రత్యేకమైన ఉద్వేగభరిత వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు..అందుకే ఇంట్లో ఈ చెట్టును నాటడం నిషేధించబడింది.