ఇంటి దగ్గర ఆడుకుంటూ ఓ చిన్నారి రెండు ఇళ్ళ మధ్య సందులో ఇరుక్కుంది. కనీసం అర అడుగు వెడల్పు కూడా లేని ఆ సందులో చిన్నారి దూరిపోయింది. నరకయాతన అనుభవించిన చిన్నారిని అతి కష్టం మీద సహాయక సిబ్బంది క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది
అనంతపురం జిల్లా ఆవుల తిప్పయ్యపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి అవంతిక ఆడుకుంటూ రెండు ఇళ్ల మధ్య వాస్తు కోసం వదిలేసిన సందులోకి వెళ్లి ఇరుక్కుంది. ఎంతసేపటికి సందులో నుంచి బయటికి రాకపోవడంతో కేకలు వేసిన చిన్నారి అరుపులను విన్న తల్లిదండ్రులు వచ్చి చూశారు. రెండు ఇళ్ళ మధ్య వాస్తు కోసం వదిలేసిన సందులో ఇరుక్కుని కనిపించింది. దీంతో చేసేదేం లేక చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. సందులోకి అయితే వెళ్ళింది. కానీ తిరిగి రావడం తెలియక.. మరో వ్యక్తి వెళ్లి తీసుకురావడం కుదరక దాదాపు రెండు, మూడు గంటల పాటు చిన్నారి నరకయాతన అనుభవించింది. ఆ రెండు ఇళ్ళ మధ్య సందులో ఇరుక్కునే ఉంది. చివరికి పోలీసులు ఓవైపు ఇంటి గోడను పగలగొట్టి చిన్నారిని రక్షించారు. చిన్నారి అవంతిక సురక్షితంగా బయటకు రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు, ఫైర్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అమిత్ బార్దర్ అభినందనలు తెలిపారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..