SGSTV NEWS online
Spiritual

మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..

 


మనిషి జీవితం అతని కర్మలపై ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతుంటారు. మనిషికి మరో జన్మ ఉంటుందని, మనం ఈ జన్మలో చేసే పనులు మరో జన్మపై ప్రభావం చూపుతుందని గరుడ పురాణం చెబుతుంది. ఈ జన్మలో మీరు చేసే పనుల ఆధారంగా వచ్చే జన్మలో మీరు ఎలా పుడతారో చెప్పేందుకు గరుడ పురాణంలో కొన్ని విషయాలను వివరించారు…


మనిషి జీవితం అతని కర్మలపై ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతుంటారు. మనిషికి మరో జన్మ ఉంటుందని, మనం ఈ జన్మలో చేసే పనులు మరో జన్మపై ప్రభావం చూపుతుందని గరుడ పురాణం చెబుతుంది. ఈ జన్మలో మీరు చేసే పనుల ఆధారంగా వచ్చే జన్మలో మీరు ఎలా పుడతారో చెప్పేందుకు గరుడ పురాణంలో కొన్ని విషయాలను వివరించారు. ఇంతకీ మన కర్మ ఆధారంగా మనం వచ్చే జన్మలో ఎలా జన్మిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం..

* గరుడ శాస్త్రం ప్రకారం ధర్మం, వేదాలను, పురాణాలను, మత గ్రంథాలను అవమానించే వ్యక్తి అయితే మీరు గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మంలో కుక్క రూపంలో జన్మిస్తారని చెబుతున్నారు.

* స్నేహ బంధం ఎంతో విలువైందని చెబుతుంటారు. అలాంటి బంధాలను కొందరు అవహేళన చేస్తుంటారు. నమ్మిన మిత్రులనే మోసం చేస్తుంటారు. గరుడ శాస్త్రం ప్రకారం స్నేహతులను నమ్మించి మోసం చేస్తే వచ్చే జన్మలో రాబందులుగా జన్మిస్తారు.

* ఇక కొంతమంది చాలా తెలివైన వారు ఉంటారు. తమ తెలివితేటలతో ఎంతో ఇబ్బందికరమైన పనులను కూడా సింపుల్‌గా చేసేస్తారు. అయితే ఈ తెలివిని దుర్వినియోగం చేసి ఇతరులను మోసం చేస్తే ఇలాంటి వాళ్లు వచ్చే జన్మలో గుడ్ల గూబల్లా జన్మిస్తారు శాస్త్రం చెబుతోంది.

* ఎలాంటి కారణం లేకుండా ఇతరులను ధూషించేవారు, ఇతరులపై ప్రేమతో ఉండకుండా,నిత్యం ఇతరులను ద్వేషఙంచే వారు వచ్చే జన్మలో మేకగా జన్మిస్తారని గరుడ పురాణం చెబుతోంది.

* గరుడ పురాణం ప్రకారం ఈ జన్మలో వివాహేతర సంబంధం పెట్టుకొని, బంధాల విలువలను దెబ్బతిసే వారు వచ్చే జన్మలో నపుంసకలుగా పుడతారని శాస్త్రంలో తెలిపారు.

* తల్లిదండ్రులను, తోబుట్టువులను వేధించే వారికి అసలు మరో జన్మంటూ ఉండదని పురాణంలో చెబుతున్నారు.

Related posts