October 16, 2024
SGSTV NEWS
CrimeTelangana

సరదా అనేది ఒక పరిమితి వరకు మంచిదే.. అది హద్దులు దాటితే ఇలా ఉంటది..!

ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇలాంటి విషయాలలో మరీ మరీ జాగ్రత్తలు వ్యవహరించాల్సిందే..! లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే సంఘటనలు ఇదివరకు ఎన్నో చూశాం. అలాంటి మరో ఘటనే తాజాగా హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది.



ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇలాంటి విషయాలలో మరీ మరీ జాగ్రత్తలు వ్యవహరించాల్సిందే..! లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే సంఘటనలు ఇదివరకు ఎన్నో చూశాం. అలాంటి మరో ఘటనే తాజాగా హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


చిన్న చిన్న పండగలకి గ్రామాలలో, అనేక ప్రాంతాలలో చిన్నపిల్లల కోసం ఉయ్యాలలు పెడుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కుటుంబంతో సహా ఎక్కడికైనా కాలక్షేపం కోసం బయటికి వెళ్లినప్పుడు ఇలా ఉయ్యాలలో పిల్లలను ఊగించడం అదొక సరదా. కానీ, ఆనందంగా గడపాల్సిన అలాంటి విషయాల్లో పిల్లల రక్షణ పట్ల తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వయసులో మంచి ఏదో చెడు ఏదో తెలిసే అవగాహన ఉండదు. అందుకే ఆ విషయాలపై తల్లిదండ్రులే జాగ్రత్త పడాలని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.

హైదరాబాద్ మహానగరం పాతబస్తీ కాలాపత్తర్ ఏరియాలో జరిగిన ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉయ్యాలలో కూర్చొని ఊగే సమయంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తుగా ఆమె తల వెంట్రుకలు ఉయ్యాలలో ఇరుక్కుపోవడంతో చావు బతుకుల మధ్య బయటపడింది. ఈ ఘటనలో ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. జుట్టు పూర్తిగా తెగిపోయి గాయాలతో బయటపడడంతో ఆ చిన్నారి ఎంతో అదృష్టవంతురాలని వచ్చిన స్థానికులు చెబుతున్నారు. అటు నిర్వాహకులు ఇటు తల్లిదండ్రులు కూడా ఇలాంటి ప్రమాదాల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు.


కూర్చున్న ఉయ్యాల ఇరుకుగా ఉండి, పిల్లలు ఆడేందుకు సౌకర్యంగా లేదు. సరదా కోసం పోతే ఇంకేదో అయిందన్నట్లు ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు ఇదొక భయానక ఘటనలా మారింది. ఇలాంటివి చూశాక మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా ముందు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. పిల్లల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించి వాళ్లకు ఏది సరైనదో ఏది కాదో నిర్ణయించాల్సిన పెద్ద బాధ్యత ఖచ్చితంగా పెద్దవాళ్లదే ఉంటుందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషం కోసం ఉయ్యాలలో కూర్చోబెట్టి ఇలాంటి ఆటలు ఆడించడానికి ఆరాటపడుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మంచిదే అయినప్పటికీ.. అదే సమయంలో అప్రమత్తత కూడా అవసరమే. అందుకే పిల్లల బాగోగులు చూసే విషయంలో వాళ్ల సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలని పలువురు చెబుతున్న మాట.

Also read :

Related posts

Share via