July 7, 2024
SGSTV NEWS
CrimeTelangana

తాగింది గోరంత.. మిషన్ చూపించేదీ కొండంత”.. లబోదిబోమంటున్న ఆటోవాలా..!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులకు ప్రతిరోజూ వింత ఘటనలు ఎదురవుతుంటాయి. ఎలాంటి పేపర్లు లేకుండా బుకాయించే వాళ్లు కొందరైతే.. సిగ్నల్స్ జంప్ చేసి పట్టుబడే వాళ్లు మరి కొందరు. ఇదిలా ఉంటే, తాగి వాహనాలు నడిపి దొరికిపోయేవారు ఇంకో రకం. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తనిఖీలు నిర్వహించే సమయంలో అడ్డంగా దొరికిపోయాడు. తప్పు కదా అని అడిగితే, విచిత్రమైన కారణాలు చెబుతూ బుకాయించాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

తనిఖీల్లో భాగంగా రోడ్డు మీద వెళ్తున్న ఆటోను ట్రాఫిక్ సిబ్బంది పట్టుకున్నారు. అందులో నుంచి ఒక వయసు పైబడిన ఆటో డ్రైవర్ దిగాడు. చూస్తే అప్పటికే ఫుల్లుగా మద్యం తాగేసి ఉన్నాడు. తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని, పేపర్లు చూపించాలని ట్రాఫిక్ పోలీసులు బెదిరించారు. ఇక అంతే ఏడుపు మొహం పెట్టేసి.. అలా తాగి, ఇలా బయటకు రావడమే ఆలస్యం పోలీసులు పట్టుకున్నారని బోరుమన్నాడు. తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, కాస్త దయ చూపించి వదిలేయాలని బ్రతిమిలాడుకున్నాడు. పోలీసులు ససేమిరా అంటున్నా వినకుండా భయపడిపోతూ ఇంకోసారి ఇలా చేయనని బుకాయించాడు. తాగింది గోరంత అయితే, మిషన్ చూపించేదీ కొండంత అంటూ తప్పు మీటర్‌ను తప్పుబట్టాడు.

రోజంతా కష్టపడితే తప్ప ప్యాసింజర్లు దొరకడం లేదని, అందుకే ఆ బాధలో ఉండి ఒక పెగ్గు తాగానని కంటితడ పెట్టుకున్నాడు. తానెప్పుడూ తాగలేదని, ఈ రోజే మొదటిసారి తాగానని, ఇలా తాగి బయటకి వచ్చానో లేదో పోలీసులు పట్టేసుకున్నారని మొర పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయ్యో పాపం ఆటో వాడు ఎంత బాధలో ఉన్నాడో అని కామెంట్లు చేస్తున్నారు. తాగి ఆటో నడిపి దొరకిపోవడమే కాకుండా.. అతను చెప్పే సమాధానాలు మరింత విచిత్రంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కళ్లను తుడుచుకుంటూ ఆ వయసులో ఉన్న వ్యక్తి బతిమిలాడుతుంటే ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు కదా మరి..!

Also read +Missing Mystery: పవన్ కల్యాణ్ చొరవతో.. వీడిన యువతి మిస్సింగ్‌ మిస్టరీ.. విచారణలో బయటపడ్డ విస్తుపోయే వాస్తవాలు!

ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు..

ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు..

Hyderabad: కూరగాయలు అమ్ముతూ.. ఇంటి ముందుకు వస్తాడు.. కానీ ఆ తర్వాతే అసలు యవ్వారం..!

మంచిదొంగ.. దోచిన సొమ్మును నెల రోజుల్లో ఇస్తానని లేఖ రాసి

Related posts