ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని NTTPS కోల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోల్‌ప్లాంట్ టీపీ-94ఏ2 బెల్టు వద్ద మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కొండపల్లి సమీపంలోని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS) కోల్ ప్లాంట్‌లో ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో కోల్‌ప్లాంట్ టీపీ-94ఏ2 బెల్టు దగ్గర మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. NTTPS అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
వారి నిర్లక్ష్యం కారణంగా స్టేజ్-1 బంకర్‌కి వెళ్లే కన్వేయర్ బెల్ట్.. 40 మీటర్ల మేర మంటలతో దగ్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 420 యూనిట్ల మేర విద్యుత్ నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు సర్వశక్తులా కృషి చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే