ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అదనపు కట్నం తేవడం లేదంటూ అత్తమామలు ఒక మహిళను కొట్టి, ఆమెకు హెచ్‌ఐవి ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ ఘటన మీరట్ లో చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అదనపు కట్నం తేవడం లేదంటూ అత్తమామలు ఒక మహిళను కొట్టి, ఆమెకు హెచ్‌ఐవి ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ ఘటన మీరట్ లో చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గంగోహ్‌లోని ఒక గ్రామానికి చెందిన మహిళ తండ్రి, తన కుమార్తె సోనాల్ సైనీని 2023 ఫిబ్రవరిలో హరిద్వార్‌లోని జస్వాలా పిరాన్ కలియార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో వివాహం చేశాడు. కట్నంగా కారు, రూ.15 లక్షల నగదు, లక్షల విలువైన ఆభరణాలు కూడా ఇచ్చాడు. అయితే, బాధితురాలి అత్తమామలు మరిన్ని కట్నాలు కోరుతూ స్కార్పియో ఎస్‌యూవీని, రూ.25 లక్షల నగదును డిమాండ్ చేశారు.
హెచ్‌ఐవి సోకడానికి ఇంజెక్షన్
అయితే బాధితురాలి తండ్రి ఆ డిమాండ్ లకు ఒప్పుకోకపోవడంతో సోనాల్ సైనీ భర్త, అత్తమామలు ఆమెను వేధించడం ప్రారంభించారు. తనను కొట్టి ఇంటి నుండి వెళ్లగొట్టారు. అయితే మహిళ తండ్రి పంచాయితీ పెట్టడంతో తిరిగి కోడలును ఇంటికి తీసుకువెళ్లారు. అయితే వేధింపులు మాత్రం ఆగలేదు. కోడలను చంపాలనే ఉద్దేశ్యంతో ఆమెకు హెచ్‌ఐవి సోకడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు.
సోనాల్ సైనీ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత సోనాల్ సైనీకి హెచ్‌ఐవి సోకినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే బాధితురాలి కుటుంబానికి షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే, ఆమె భర్త అభిషేక్‌కు పరీక్షలు నిర్వహించినప్పుడు మాత్రం అతనికి హెచ్‌ఐవి నెగిటివ్ అని తేలింది. దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది, కానీ నిందితులపై ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో ఆమె తండ్రి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు గంగో కొత్వాలి పోలీసులు అభిషేక్ అలియాస్ సచిన్, అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం వంటి అనేక తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also read
- బ్రహ్మకు జ్ఞానోపదేశం చేసిన శివుడు
- Maha Shivaratri 2025 : మహాశివరాత్రికి జాగరణ ఎందుకు చేయాలి?
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2025
- AP news : పోలవరం కాల్వలో పడి ఇద్దరు యువకుల మృతి
- పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్‌లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!