అమరావతి : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్‌లే కారణమని మదన్ మోహన్ అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిపై ఇటీవల సస్పెండ్ వేటు పడింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండతో 2021లో ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల దేవదాయ శాఖ అధికారిణిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె తీరుపై విమర్శలు వెల్లవెత్తాయి. అవినీతి ఆరోపణలతో పాటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల్లో నుంచి తొలగించారు.
Also read :Vizianagaram: దారుణం.. ఊయలలో ఉండగానే ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం
కన్న తండ్రి దుష్ట చేష్ట.. సోషల్ మీడియాలో కుమార్తె నగ్న చిత్రాలు, వీడియోలు!
విద్యార్థి ఆత్మహత్యకేసులో కొత్త ట్విస్ట్.. ఆమె వేధింపులతోనే..
Pawan Kalyan: తప్పు జరిగింది.. క్షమించండి.. దేవాలయాల్లో ప్రక్షాళన అవసరంః పవన్ కల్యాణ్