రామచంద్రపురం(చంద్రగిరి) : కర్ణాటక రాష్ట్రం నుండి టెంపో ట్రావెలర్ వాహనంలో కర్ణాటక మధ్యాన్ని తిరుపతికి తరలిస్తుండగా పట్టుబడింది. సోమవారం చంద్రగిరి సీఐ ఎం రామయ్య ఆధ్వర్యంలో చంద్రగిరి జాతీయ రహదారి వద్ద చంద్రగిరి పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేస్తుండగా కర్ణాటక భారీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనంలో మరణాయుధాలు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. దీంతో మద్యం, మరణ ఆయుధాలు ఎవరు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు..? ఎందుకోసం తీసుకొచ్చారు..? ఎక్కడికి తరలిస్తున్నారు..? అనే కోణంలో చంద్రగిరి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తిరుపతిలో మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా హింసాత్మక దాడులు చేపట్టేందుకు కుట్రలో భాగంగానే ఈ తరలింపులు జరుగుతున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజులకు ముందుగానే భారీగా తిరుపతికి కర్ణాటక మద్యం, తరలించారేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తిరుపతి జిల్లా పోలీసులు ఇంకా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఓట్లు లెక్కింపు కేంద్రం వద్ద, చంద్రగిరి నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ.. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పోలీసులకు చాలెంజ్గా మారింది. పూర్తి వివరాలను చంద్రగిరి పోలీసులు మీడియా సమావేశం ద్వారా వెల్లడించనున్నట్లు సిఐ రామయ్య తెలిపారు
Also read
- మసాజ్ సెంటర్ల ముసుగులో గలీజు దందా.. పోలీసుల మెరుపుదాడుల్లో విస్తుపోయే వాస్తవాలు!
- Illicit Relationship: అక్రమ సంబంధం పెట్టుకుందని.. తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు!
- హైదరాబాద్లో హార్ట్బ్రేకింగ్ విషాదం.. లవర్ వదిలేసిందని ఉరేసుకున్న యువకుడు
- తెలంగాణలో దారుణం.. కూతురిని వేధిస్తున్నాడని యువకుడిని అందరి ముందు హత్య చేసిన తండ్రి
- pakala: భార్య, ఇద్దరు బిడ్డలను బావిలోకి తోసి హత్య పాకాలలో హృదయ విదారక ఘటన