July 7, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

భారీగా చౌక బియ్యం పట్టివేత

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్ మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది.

తిరువూరు, : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు
రాజుపేటలోని రైస్ మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం గ్రామానికి చెందిన బొజ్జా చంద్రశేఖర్ (చంద్ర) మునుకుళ్ల, ముష్టికుంట్లకు చెందిన మరో ఇద్దరితో కలిసి రాజుపేటలోని రైస్ మిల్లు లీజుకు తీసుకుని కాకినాడ పోర్టుకు చౌక బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. వైకాపాకు చెందిన ఓ మాజీ ఎంపీ, స్థానిక నాయకుల సహకారంతో తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని ఎండీయూ వాహనాల నుంచి బియ్యాన్ని సేకరించి రాజుపేటలోని రైస్మిల్లుతో పాటు వీరికి చెందిన గోదాముల్లో నిల్వ చేసి ఎగుమతి చేస్తున్నారు. రైస్మిల్లులో చౌకబియ్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం మేరకు పౌరసరఫరాలశాఖ ఏఎస్వి లక్ష్మీనారాయణ, డీటీ కె. శ్వేత బుధవారం సోదాలు చేశారు. ఎగుమతి చేయడానికి రెండు లారీల్లో సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని బస్తాలతో పాటు, రైసిమిల్లులో విడిగా ఉన్న బియ్యాన్ని గుర్తించారు. విడిగా ఉన్న బియ్యాన్ని తూకం వేసేందుకు వచ్చిన హమాలీలను
వ్యాపారి చంద్రశేఖర్ బెదిరించడంతో మధ్యాహ్నం నుంచి వారు వెళ్లిపోయారు. దీంతో మరో ముఠాకు చెందిన హమాలీలను పిలిపించి బియ్యం తూకం వేసి బస్తాలను లెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు బస్తాలను లెక్కించగా 32.5 టన్నుల రేషన్ బియ్యం తూగింది. పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

1,482 టన్నుల బియ్యం స్వాధీనం

కాకినాడ కలెక్టరేట్, : కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని గోదాములపై కొద్ది రోజులుగా జరుగుతున్న దాడుల్లో భారీ ఎత్తున రేషన్ బియ్యం బయటపడుతూనే ఉంది. రెవెన్యూ, పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారుల బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. పోర్టు సమీపంలోని సాయితేజ షిప్పింగ్ సర్వీసెస్ గోదాముల నుంచి రూ.3.54 కోట్ల విలువైన 1,482 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోదాములపై దాడులు కొనసాగుతాయని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్ తెలిపారు.

Also read :రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

Who is Bhole Baba: జైలుకెళ్లొచ్చిన ఓ కానిస్టేబుల్.. ‘భోలే బాబా’గా ఎలా అవతరించాడంటే? సినిమా స్టోరీకి మించిన ట్విస్టులు

Related posts

Share via