April 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఇళ్లు కోసం బిడ్డను చంపిన సవతి తల్లి.. హైదరాబాద్‌లో హతమార్చి నల్గొండలో పాతిపెట్టి!


శాలిగౌరారం మూసీ వాగులో దొరికిన యువతి డెడ్ బాడీ జనగామ జిల్లా పడమటి తండా మహేశ్వరిగా గుర్తించారు. మహేశ్వరికి కట్నం కింద కోటి రూపాయల ఇళ్లు ఇస్తానని తండ్రి ఒప్పుకున్నాడు. కానీ ఆ ఆస్తి తనకే దక్కాలని ఆమెను చంపినట్లు సవతి తల్లి లతిత ఒప్పుకోగా అరెస్టు చేశారు.

TG Crime: మూసీవాగులో ఓ యువతి మృతదేహం లభించడం సంచలనం రేపుతోంది. శాలిగౌరారం వంగమర్తి గ్రామం వాగులో పోలీసులు వెలికితీసిన డెడ్ బాడీని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పాతిపెట్టినట్లు గుర్తించారు. మృతురాలిది జనగామ జిల్లా పడమటి తండాకు చెందిన జటావత్ మహేశ్వరిగా నిర్ధారించారు. అయితే ఈ కేసు విచారణలో భయంకర నిజాలు బయటపడ్డాయి. తల్లే చంపినట్లు తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో హత్య..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనా నాయక్ మొదటి భార్య కూతురు మహేశ్వరి. అయితే ఈనా నాయక్ కొంతకాలం క్రితం లలిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల మహేశ్వరికి పెళ్లి సంబంధం కుదిర్చిన ఈనా.. కోటి రూపాయల విలువ చేసే ఇంటిని కట్నం కింద ఇస్తానని ఒప్పుకున్నాడు. దీంతో ఆ ఇళ్లు తనకే కావాలని భావించిన లలిత.. తన మేనబావ అయిన ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో 2024 డిసెంబర్ లో మహేశ్వరిని చంపేసింది. అనంతరం కానిస్టేబుల్ సహాయంతో వంగమర్తి దగ్గర మూసీ వాగులో పాతిపెట్టింది.

అయితే తండ్రి మిస్సింగ్ కేసు పెట్టగా.. తాజాగా శాలిగౌరారం వంగమర్తి గ్రామం వాగులో డెడ్ బాడీ లభించడం కలకలం రేపింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆస్తి కోసమే మహేశ్వరిని హతమార్చినట్లు లలిత అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యకు సహకరించిన వారికోసం పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Also read

Related posts

Share via