తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పసికందును పూడ్చిపెట్టడానికి ఒడిగట్టారు తల్లిదండ్రులు. తణుకు సాయి హాస్పిటల్లో 28వ తేదీ ఉదయం 10: 30ని.లకు సంధ్యా కుమారి అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తలలో ప్రాబ్లమ్ కారణంగా చనిపోయే అవకాశం ఉందని బావించిన తల్లిదండ్రులు..
ఆ శిశువును బతికుండగానే పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు.
బిడ్డను తాడేపల్లిగూడెం శ్మశానంలో పూడ్చేందుకు ప్రయత్నిస్తుండగా బిడ్డ అరుపులతో కాటికాపరి అలర్ట్ అయ్యాడు. దాంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు కాటికాపరి, బిడ్డను పూడ్చి పెట్టేందకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పారిపోగా, మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..
- పిల్లలను కారులో ఉంచి లాక్ చేయడంతో…కొంచమైతే ఎంతఘోరం జరిగేది?
- పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
- తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు