SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: వీడు మనిషి కాదు మృగం.. చెల్లిని తల్లిని చేసి..


సమాజంలో అంతరించిపోతున్న మానవ నైతిక విలువలకు అద్దం పట్టే సంఘటన ఇది. అన్నమయ్య జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలంలో వెలుగు చూసిన అమానుష సంఘటన అందర్నీ కలచివేసింది. మైనర్‌ బాలికను వరుసకు అన్నఅయ్యే వ్యక్తి తల్లిని చేశాడు

AP Crime: సమాజంలో అంతరించిపోతున్న మానవ నైతిక విలువలకు అద్దం పట్టే సంఘటన ఇది. అన్నమయ్య జిల్లా(annamayya-district) లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పీలేరు నియోజకవర్గం కేవీపల్లె, మండలంలో వెలుగు చూసిన అమానుష సంఘటన అందర్నీ కలచివేసింది. మైనర్‌ బాలికను వరుసకు అన్న(brother) అయ్యే వ్యక్తి తల్లి(pregnent-lady) ని చేశాడు. పీలేరు నియోజకవర్గంలోని ఓ మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తల్లిని చేశాడు అన్న. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సోదరి బాగోగులు చూసుకోవాల్సిన సోదరుడు కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు..ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చడమే కాకుండా మగబిడ్డకు జన్మనిచ్చింది..


వివరాల్లోకి వెళ్తే.. మైనర్ బాలిక తండ్రి పక్షవాతం సోకి కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో మైనర్ బాలిక తల్లి బతుకుదెరువు నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్న ఆ బాలికపై ఆమె పెద్దనాన్న కుమారుడు కన్నేశాడు, కొంతకాలంగా ఆమెను లొంగదీసుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు…ఈ క్రమంలో మైనర్ బాలిక గర్భం దాల్చింది. అయితే రోజురోజుకూ శరీరంలో మార్పులు వస్తున్నప్పటికీ బాలిక ఎవరికంట పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. చివరకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు బాలికను మూడు రోజుల క్రితం పీలేరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యురాలి వద్దకు తీసుకెళ్లడంతో బాలిక గర్భంతో ఉన్న విషయం తెలిసింది.. ఈ నెల 7వ తేదీన బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలికను గట్టిగా అడగడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందన్న భయంతో పుట్టిన బిడ్డను వదిలించుకోవాలని బంధువులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు

Also read

Related posts