November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

బెట్టింగ్‌లో కాలేజీ ఫీజు పోగొట్టుకున్నాడు.. తల్లిదండ్రులు తిట్టారని..

Hyderabad Crime News: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో బెట్టింగ్ యాప్స్ లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ దారుణంగా మోసపోతున్నారు. కొంతమంది అప్పు చేసి మరీ బెట్టింగ్ లకు పాల్పపడటం.. అంతా గొట్టుకొని మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకోవడం కామన్ అయ్యింది.

డబ్బు సంపాదన కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. అమాయకుల అవసరాలు ఆసరాగా చేసుకొని అందినంత డబ్బు గుంజుతున్నారు. ఇటీవల ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే యావతో ఎంతోమంది బెట్టింగ్‌లకు పాల్పపడుతున్నారు. డబ్బు పొగొట్టుకొని ఎవరికీ చెప్పుకోలేక.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పపడుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువ అయ్యాయి. చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు బెట్టింగ్‌ వ్యసనానికి బలి అవుతున్నారు. తాజాగా కాలేజ్ ఫీజు కోసం కట్టాల్సిన డబ్బులు బెట్టింగ్‌లో పెట్టాడు.. తర్వాత ఏం జరిగిందంటే. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also read :భర్త కార్పెంటర్.. భార్యను కష్టపడి చదివిస్తే.. ప్రియుడితో కలిసి

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కాలేజ్ ఫీజు కట్టమని తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు బెట్టింగ్ లో పెట్టి మోసపోయిన ఇంజనీరింగ్ విద్యార్థ మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన కొండూరు శ్రీను, లక్ష్మల తనయుడు నితిన్ (21) మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ యానంపేట్ లో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఈ మధ్యనే కాలేజ్ ఫీజ్ చెల్లించాలంటూ తల్లిదండ్రుల వద్ద రూ.లక్షా 30 వేలు తీసకున్నాడు నితిన్. ఆ ఫీజ్ కాలేజ్‌లో చెల్లించకుండా ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి మొత్తం పోగొట్టుకున్నాడు. ఫీజు చెల్లించకపోవడవంతో కాలేజ్ కి వెళ్లకుండా.. పోగొట్టుకున్న డబ్బు గురించి ఇంట్లో చెప్పలేక సతమతమయ్యాడు.

Also read :చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన రెండు వారాలకే ఘోరం.. అసలు ఏం జరిగిందంటే?

ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు అసలే కుటుం పరిస్థితి బాగాలేదు.. ఇలాంటి సమయంలో ఎందుకు ఈ పని చేశావు అంటూ నితిన్ ని మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నితిన్ మంగళవారం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని యానంపేట్ సమీపంలో ఖాజీ పేట్ నుంచి సనత్ నగర్ వైపు వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని వద్ద లభించిన సెల్ ఫోన్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు

Also read :ఓవరాక్షన్ ట్రైనీ IAS గుట్టురట్టు! కోట్ల ఆస్తి పెట్టుకుని పూజ ఘరానా మోసం?

Related posts

Share via