SGSTV NEWS
CrimeTelangana

TG Crime: వీడు భర్త కాదు రాక్షసుడు.. భార్యను అడవిలోకి తీసుకెళ్లి..!


ఆదిలాబాద్ జిల్లాలో ఓ భర్త తన భార్య మీద అనుమానంతో పూజలు పేరుతో అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. పూజ చేస్తున్నట్లు నటించి భార్య తలపై బండ రాళ్లతో కొట్టాడు. దీంతో ఆమె మృతి చెందింది. అనుమానంతో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను, భర్తలు భార్యలను దారుణంగా హత్యలు చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానం, ఇతరులతో ఉన్న రిలేషన్స్ వల్ల ప్రస్తుత కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఆదిలాబాద్‌లోనూ ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తలమడుగు మండలం లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది.

అనారోగ్యం పేరుతో భార్యను..
సుందరయ్య నగర్ కాలనీలో ఉంటున్న ఇంగోలి వందన (40) అనే మహిళ మీద అనుమానంతో తన భర్త శంకర్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వందనకు ఆరోగ్యం బాలేదని, భర్త ఇంగోలి శంకర్ పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో జులై 2వ తేదీన లక్ష్మీ పూర్ చెక్‌పోస్టు దగ్గర ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు.

భార్యను నమ్మించడానికి అక్కడ కొబ్బరి కాయ, పసుపు, కుంకుమ వంటి వాటితో పూజలు నిర్వహించారు. ఆ పై భార్యను తలపై బండ రాళ్లతో కొట్టి హత్య చేశాడు. ఎవరికి తెలియకుండా ఇంటికి వచ్చేశాడు. అయితే తల్లి కనిపించకపోయే సరికి తండ్రి మీద అనుమానంతో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది

ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా తన భార్యను చింపేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే హత్య జరిగిన ప్రదేశంలో పూజలు ఉండటంతో క్షుద్ర పూజల పేరుతో హత్య చేశాడని స్థానికులు భావిస్తున్నారు. అలాగే అక్రమ సంబంధం వల్ల అనుమానంతో తన భార్యను చంపినట్లు అంటున్నారు. దీనిపై పూర్తి విచారణ ఇంకా పోలీసులు చేస్తున్నారు

Also read

Related posts

Share this