మేడిపల్లి: ప్రియురాలితో వీడియోకాల్ మాట్లాడుతూ.. ఒక
బాలుడు ఉరి వేసుకుని మృతి చెందాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. బోడుప్పల్లోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఓ ప్రయివేట్ ఉద్యోగి నివసిస్తున్నాడు. అతని కుమారుడు గంగాధరి అభినవ్ (17) ఐటీఐ చదువుతున్నాడు.
మేడిపల్లిలోని మహేంద్ర కార్ షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఈ నెల 5న తల్లిదండ్రులు రాత్రి షాపింగ్ కోసమని బయటకు వెళ్లారు. ఇంట్లో ఉన్న బాలుడు క్లాస్మేట్ అయిన ప్రియురాలికి వీడియోకాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించాడు. చున్నీతో అభినవ్ ఉరి వేసుకోవడం చూసిన బాలిక.. వెంటనే అతని స్నేహితులకు సమా చారం అందించింది.
స్నేహితులు వెంటనే బాలుని ఇంటికి చేరుకుని తలుపు బలవంతంగా తెరిచి.. అతన్ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. అభి నవ్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు ఆదివారం రాత్రి తెలిపారు.
Also Read
- ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఉరి
ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య - మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
- బీభత్సం సృష్టించిన అంబులెన్స్.. మహిళ మృతి
- అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
- బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి కుటుంబసభ్యులు ఏమి చేశారంటే?





