మార్కాపురం: హోటల్ కు వెళ్లి సర్వర్ తో ఇడ్లీ తెప్పించుకుని పుష్టిగా ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ హోటల్లో కె.మహేష్ రెడ్డి ఇడ్లీ తిన్నాడు.
Also read :Crime News: ‘బావా తప్పు జరిగిపోయింది.. నన్ను క్షమించు’.. వివాహిత విషాదాంతం
హోటల్ బాయ్ అంజి బిల్లు కట్టాలని కోరగా మహేష్ దాడికి దిగాడు. అడ్డుకోబోయిన హోటల్ సిబ్బంది పరమేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డిపైనా మహేష్ దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్ రెహమాన్ తెలిపారు.
Also read :Watch Video: గుండె తరుక్కుపోయే ఘటన.. మోకాళ్లపై గిరిజనుల మొర.. ఎందుకంటే..