హైదరాబాద్: హవాలా ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఈ ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు గురువారం(డిసెంబర్ 5వ తేదీ) అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రకాష్ ప్రజాపతి(30), ప్రజ్ఞేశ్ కీర్తిభాయ్ ప్రజాపతి(28)లను ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ మీడియా సమావేశంలో హవాలా నిందితుల్ని అరెస్ట్ చేసిన విషయాన్ని స్పష్టం చేశారు.
గతేడాది డిసంబర్ 7వ తేదీన నాగోల్కు చెందిన వి విశ్వనాథ్ చారీ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి రూ.50 లక్షలను మోసపోయినట్లు బోయినపల్లి పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు. క్యాష్ను ఆర్టీజీఎస్ లో మార్చతామని వారు నమ్మబలికి విశ్వనాథ్ చారీని మోసం చేశారు హవాలా కేటుగాళ్లు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎట్టకేలకు హవాలా ముఠా సభ్యుల్లో ఇద్దర్ని అరెస్ట్ చేసి భారీ మొత్తాన్ని రికవరీ చేశారు.
నిందితులిద్దరూ గుజరాత్కు చెందిన వారే. వీరు నగదును మార్చడాన్ని వ్యాపారంగా చేసుకుని ఇలా మోసాలకు పాల్ప డుతున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ చారీ, ఆయన స్నేహితుల్ని బురిడీ కొట్టించి రూ. 50 లక్షలు దోచుకున్నారు. అయితే వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. హుండాయ్ క్రెటా కారులో వెళుతున్న సమయంలో వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితుల్ని పట్టుకున్న టీమ్ను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ అభినందించారు. తాము దోచుకున్న నగదు రూ. 4.05 కోట్లను నాగ్పూర్ నుండి బెంగళూరుకు హవాలా రూపంలో బదిలీ చేయడంలో తన ప్రమేయం ఉందని ప్రకాష్ ప్రజాపతి విచారణలో అంగీకరించాడు.
Also Read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





