చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి
పాల్పడిన దుండగులు తప్పించుకున్నారా లేక పోలీసులు తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటన తర్వాత వర్సిటీ గేటు నుంచే వెళ్లిపోయిన నిందితులు
తిరుపతి: చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి పాల్పడిన దుండగులు తప్పించుకున్నారా లేక పోలీసులు తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నానిపై మంగళవారం జరిగిన ఘటనలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీ ఈవీఎంలను భద్రపరిచేందుకు వెళ్లే ప్రధాన మార్గంలోని గేట్ల వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే కాపలాగా ఉంచారు. వాస్తవానికి నానిపై దాడి ప్రధాన గేటుకు 200 మీటర్ల దూరంలోనే జరిగింది. అప్పుడు అక్కడే ఉన్న కానిస్టేబుళ్లు వెంటనే గేట్లను పూర్తిగా మూసివేయాల్సి ఉన్నా చేష్టలుడిగి నిల్చుండిపోయారు. దీని వల్ల నిందితులు బయటకు పారిపోయారని తెదేపా నాయకులు విమర్శిస్తున్నారు.
సమాచారం ఇచ్చినా..: తనపై దాడి చేసేందుకు వైకాపా
మూకలు వాహనాన్ని చుట్టుముట్టినట్లు పులివర్తి నాని పలువురు పోలీసులకు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు చెప్పి వెంటనే సెట్లో స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పినా కనీసం పట్టించుకోలేదని పులివర్తి సుధారెడ్డి ఆరోపిస్తున్నారు. అక్కడే ఉన్న పోలీసులను, సీఆర్పీఎఫ్ సిబ్బందిని సాయం చేయాలని కోరినా ఫలితం లేకపోయిందన్నారు. నిందితులు కారులో రావడం, దాడి చేయడం.. ఆ తర్వాత ప్రధాన గేటు నుంచి పరుగులు తీస్తూ బయటకు వెళ్లిపోవడానికి పది నిమిషాలు పట్టింది. ఎస్వీ క్యాంపస్ పోలీస్ స్టేషన్తోపాటు ఎమ్మార్పల్లి ఠాణా సైతం వర్సిటీకి దగ్గరలోనే ఉన్నాయి. నిందితులు దాడి చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే అక్కడికక్కడే పట్టుకునేందుకు అవకాశం ఉండేది. వైకాపా నేతల ఆదేశాల మేరకే నిందితులు తప్పించుకునేందుకు పోలీసులే సహకరించారన్న ఆరోపణలున్నాయి. తనను అంతమొందించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్రెడ్డిలు కుట్ర పన్నారని పులివర్తి నాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన భానుప్రకాష్రెడ్డి, గణపతిరెడ్డిలతోపాటు ఇతరులు అని మాత్రమే ఎఫ్ఎర్లో పేర్కొంటూ అసలు నిందితులను వదిలేశారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..