జిమ్ ట్రైనర్ పై డంబెల్ తో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జిమ్‌ట్రైనర్ అయిన ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్‌లో ఉండగా డంబెల్స్‌తో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Gym Trainer Kills : హైదరాబాద్ బోడుప్పల్‌లో విషాదం నెలకొంది. ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్‌లో ఉండగా డంబెల్స్‌తో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు
బోడుప్పల్ కళానగర్ కాలనీకి చెందిన ఏర్పుల సాయి కిశోర్ , చంటి ఇద్దరూ స్నేహితులు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కిశోర్ మీద కక్ష పెంచుకున్న చంటి.. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కిశోర్‌కు చెందిన జస్ట్ ఫిట్ జిమ్‌కు వెళ్లాడు. అతనితో పాటు మరో ముగ్గురు స్నేహితులను తీసుకెళ్లాడు. అక్కడ మళ్లీ గొడవ జరగడంతో చంటి జిమ్‌లో ఉన్న డంబెల్ తీసుకుని కిశోర్ తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
చంటి దాడిలో తీవ్రంగా గాయపడిన కిశోర్‌ను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ హాస్పిటల్ కు తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కిశోర్ మరణించాడు. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చంటిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన ముగ్గురు స్నేహితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.వివాహేతర సంబంధమే ఈ హత్యకు గల కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితున్ని విచారించాక అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Also read
- దేవుడి దర్శనం తర్వాత గుడిలో కాసేపు ఎందుకు కూర్చుంటారో మీకు తెలుసా..?
- Crime News: సరూర్‌నగర్ కిడ్నీరాకెట్ కేసులో కీలక పరిణామం..సీఐడీ చేతికి చిక్కిన సూత్రదారి
- కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
- భార్యకు అదే పిచ్చి… భర్త ఏం చేసాడంటే!
- బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!