టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. టీడీపీ పార్టీతో పాటు పదవులు కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని తెలిపారు.
టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. టీడీపీ పార్టీతో పాటు పదవులు కూడా వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవులకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు

నాపై ఉంచిన విశ్వాసానికి..
ఇన్ని రోజులు మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్ధతుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. తెలుగు దేశం పార్టీ ఇంకా ఎదగడంతో పాటు ప్రజా సేవలో కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Also read
- గొల్కొండలో తారామతి బారాదరి రిసార్ట్.. పార్టీలో డ్రగ్స్ కలకలం, వెలుగులోకి కొత్త విషయాలు
- 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం.. బస్సులో 21 మంది ప్రయాణికులు
- హనుమకొండలో ఘోరం.. మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి!
- Hyderabad: మందుబాబుల వీరంగం.. మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, అద్దాలు ధ్వంసం!
- Arava Sridhar: పవన్ కళ్యాణ్ గారూ.. ఇదేనా మీ ‘ప్రశ్నించే’ తత్వం.. సొంత ఎమ్మెల్యేపై చర్యలేవి?





