గుంటూరు జిల్లా వెంగళరావునగర్లో బాలిక అపహరణం కలకలం రేపింది.
గుంటూరు: గుంటూరు జిల్లా వెంగళరావునగర్లో బాలిక అపహరణం కలకలం రేపింది. ఆమె తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి గుర్తు తెలియని దుండగులు బాలికను కారులో తీసుకెళ్లారు. విజయవాడ మీదుగా బాలికను తీసుకెళ్లేందుకు ముఠా ప్రణాళిక వేసింది. విజయవాడ బస్టాండ్ వద్ద కారు ఆపి.. ముఠా సభ్యులు భోజనానికి వెళ్లారు.
కారు డోరు లాక్ పడకపోవడంతో బాలిక తప్పించుకుంది. విజయవాడ బస్టాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి బాలిక విషయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ సిబ్బంది కిడ్పాపర్ల నుంచి బాలికను రక్షించారు. విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు కారును అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్లు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025