కృష్ణా జిల్లా గుడివాడలో పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసిన కేసులో 9 మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ (Gudivada)లో పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసిన కేసులో 9 మంది వైసీపీ (YSRCP) నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 డిసెంబర్ 25న ఈ ఘటన జరిగింది. రావి టెక్స్ట్ టైల్ కొందరు లొ వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీతో పాటు నీరుడు ప్రసాద్ పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో రాపాక పవన్ కుమార్, మెరుగుమాల ఉదయ్ కుమార్, కొండ్రు శ్రీకాంత్, నీరుడు భార్గవ్, సుంకర సతీశ్, గొంటి అశోక్, రాజబోయిన తాండవకృష్ణ, గొల్ల వెంకటేశ్వరరావు, పండేటి మోషే ఉన్నారు. వీరిని పెదపారుపూడి స్టేషన్ కు తరలించారు. నిందితులపై బి ఎన్ ఎస్
143, 144, 188, 427, 506, రెడ్ విత్ కింద కేసు నమోదు చేశారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025